సాధారణంగానే సినిమా వాళ్లకు సెంటిమెంట్లు ఎక్కువ. అందులోనూ హీరో నందమూరి బాలకృష్ణకు సెంటిమెంట్లు మరీ ఎక్కువే. ఏ పని చేయాలన్నా ముహుర్తం చూడాల్సిందే. ఆయన సినిమాని విడుదల చేయాలంటే తేదీ, వారం, వజ్యం అన్నీ చూస్తారు. బాలకృష్ణ నటించిన లెజెండ్ మార్చి నెల 28వ తేదీ విడదలై మంచి హిట్టు కొట్టింది. దీంతో ఆ రోజును బాలయ్య సెంటిమెంట్‌గా ఫీలవుతున్నారు. దీంతో ఆయన తాజా చిత్రం 'లయన్'ని కూడా అదే రోజున విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సెంటిమెంట్‌ని అడ్డుకొంటోంది అనుష్క.
అసలు విషయం ఏమంటే అనుష్క ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'రుద్రమదేవి' చిత్రాన్ని కూడా సరిగ్గా ఇదే రోజున విడుదల చేయనున్నట్టు సమాచారం. గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రుద్రమదేవి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని మార్చి నెలాఖరున విడుదల చేసే విధంగా చూస్తున్నట్టు చిత్ర దర్శకుడు గుణశేఖర్ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకేసారి రెండు పెద్ద సినిమాలు విడుదల కావడం కుదరదు. కనుక బాలయ్య సెంటిమెంట్ ఫలిస్తుందో లేదో వేచిచూడాలి.