Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్మను వెంటాడుతున్న గణేషుడు... మళ్లీ కొత్త కేసు... ఎన్ని బోనులెక్కాలో...?

Webdunia
సోమవారం, 1 సెప్టెంబరు 2014 (21:17 IST)
మనిషిపై ఏ వ్యాఖ్య చేసినా కొట్టుకుపోతుంది కదా అని ఏకంగా దేవుడినే టార్గెట్ చేశాడు రాంగోపాల్ వర్మ. మనిషులైతే ఊర్కుంటారు కానీ దేవుడు ఊరుకుంటాడా ఏంటి... కామెంటు విసిరినందుకు పట్టుకున్నాడు. ఎక్కడబడితే అక్కడ వర్మపై కేసులు మీద కేసులు వేయిస్తున్నాడు. ఇవాళ బీజేవైఎం కార్యదర్శి గోపాల్ ఫిర్యాదు మేరకు షాహినాబ్ గంజ్ పోలీస్ స్టేషన్ లో వర్మపై కేసు నమోదైంది. ఇప్పటికే వర్మపై గణేశ్ ఉత్సవ సమితి ఫిర్యాదు మేరకు కేసు నమోదైన సంగతి తెలిసిందే.
 
అసలు వర్మ వినాయక చవితి రోజున ఏమన్నాడంటే... ‘ఇది గణేశుడి పుట్టిన రోజా... తండ్రి శివుడు అతని తల నరికిన రోజా?’ అంటూ ట్విట్టర్ ఉంది కదా అని చేతికి పనిచెప్పాడు. ఆ వ్యాఖ్యలు అంతర్జాలంలో క్షణాల్లో చుట్టేశాయి. ఐతే అంతే వేగంతో కేసులు రూపంలో బాణాలు కూడా వేగంగా వచ్చేశాయి. క్షమించాలంటూ వర్మ వేడుకుంటున్నా ఆయన్ను మాత్రం వదలడంలేదు. కేసులు వేస్తూనే ఉన్నారు. మరి వర్మ ఎన్ని కోర్టు మెట్లు ఎక్కాలో ఎన్ని బోనుల్లో నిలబడాలో..? గణేశుడు ఏమయినా శాంతిస్తే వర్మ బయటపడతారేమో...?!!

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments