Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనీస్ భాషలో 'బాహుబలి' .. పబ్బుల్లో ప్రచారం స్టార్ట్!

Webdunia
బుధవారం, 27 ఆగస్టు 2014 (16:01 IST)
హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రధారులుగా సక్సెస్ రాజమౌళి నిర్మిస్తున్న చిత్రం "బాహుబలి". ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే, ఈ చిత్రాన్ని చైనా భాషలోకి అనువదించి విడుదల చేయాలని దర్శకుడు ఎస్ఎస్. రాజమౌళి నిర్ణయించారు. దీంతో చైనీస్ పంపిణీదారులతో చర్చలు జరుపుతున్నాడు. ఈ క్రమంలో 'బాహుబలి' చిత్రానికి అక్కడి పబ్బుల్లో అప్పుడే ప్రచారం మొదలెట్టారు. 
 
కాగా, నాని, సమంత జంటగా రాజమౌళి తీసిన చిత్రం "ఈగ". ఈ చిత్రాన్ని కూడా 'కుంగ్ ఫ్లూ ఫ్లై' పేరిట చైనీస్ భాషలోకి అనువదించి విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో 'బాహుబలి' చిత్రాన్ని కూడా అనువదించి రిలీజ్ చేసేందుకు రాజమౌళి ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీని ఫలితంగా చైనాలోని పలు ప్రాంతాల్లో గోడలపై బాహుబలి పోస్టర్లు ప్రత్యక్షమవుతున్నాయి. 
 
ఫలితంగా 'బాహుబలి' సినిమా వాల్ పోస్టర్లు అప్పుడే చైనాలో సందడి చేస్తున్నాయి. అలాగే 'బాహుబలి' టాటూస్‌ను అక్కడి యువత బాగా వేయించుకుంటున్నారట. ఈ వరుస చూస్తుంటే ఈ చిత్రం అక్కడ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమనిపిస్తోంది. 

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments