Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసిన్ పరిస్థితి అధ్వానం: వాట్స్ యాప్ ద్వారా రిక్వస్టులు!

Webdunia
శుక్రవారం, 21 నవంబరు 2014 (13:03 IST)
బాలీవుడ్ ఛాన్స్ వచ్చిందో లేదో ఒక్కేసారి మునగచెట్టెక్కి కూర్చున్న అసిన్ పరిస్థితి అధ్వానంగా మారింది. అవకాశాలు వచ్చినప్పుడు చేయను పొమ్మని చెప్పిన అసిన్ ప్రస్తుతం ఛాన్సుల కోసం వెంపర్లాడుతోంది. ఫలితంగా అమ్మడు అసిన్ పరిస్థితి అధ్వానంగా మారింది. 
 
బాలీవుడ్ అవకాశాలు వచ్చాయి కదా అని చెప్పి, దక్షిణాదిన వున్న అవకాశాలను అర్ధాంతరంగా వదిలేసి కొన్నాళ్ల క్రితం అక్కడికి చెక్కేసింది. అయితే అది మూన్నాళ్ల ముచ్చటే అయింది. నాలుగైదు సినిమాలు చేయగానే అక్కడ అమ్మడికి ఛాన్సులు నిల్ అయ్యాయి. 
 
అదే సమయంలో సౌత్ నుంచి ఆఫర్లు వెళ్లినా, 'సారీ, నేను హిందీ సినిమాలే చేస్తా' అంటూ చెప్పేది. అయితే, ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ పరిస్థితి తారుమారైంది. బాలీవుడ్‌లో ఖాళీ అయిపోయింది. 
 
సౌత్‌లో ఎవ్వరూ అడగడం లేదు. దీంతో తనకు తెలిసిన దక్షిణాది హీరోలను, దర్శకులను ఛాన్సు లిమ్మంటూ వాట్స్ యాప్ ద్వారా రిక్వెస్టులు పంపుతోందట. అయితే, ఎవరూ ఆమెకు పాజిటివ్ ఆన్సర్లు మాత్రం ఇవ్వడం లేదట! మరి అసిన్ ఏం చేస్తుందో..!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments