Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్జున్ రామ్‌పాల్‌కి నోటీసులు.. అరుణ్ గావ్లీతో సంబంధమేమిటి..!

Webdunia
మంగళవారం, 3 ఫిబ్రవరి 2015 (15:05 IST)
వెండితెరపై వెలిగే సినీ తారలు తాము నటించే పాత్రలో ఇమిడిపోయేందుకు నారారకాల తంటాలు పడుతుంటారు. ఒక్కో సారి ఆ పాత్రను పోలిన వారు ఉంటే, వారిని కలుసుకుని వారి అలవాట్లను తెలుసుకుని వారిలా మారి, పాత్రను రక్తికట్టించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆ సమయంలో వారు పలు విధాలైన సమస్యల్లో ఇరుక్కుంటారు. ప్రస్తుతం అటువంటి సమస్యనే బాలీవుడ్ హీరో అర్జున్ రామ్‌పాల్ ఎదుర్కొంటున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే.. అంతర్జాతీయ అండర్ వరల్డ్ డాన్ అరుణ్ గావ్లీతో సంబంధమేమిటని, ఆయన్ను ఎందుకు కలిశారని ప్రశ్నిస్తూ బాలీవుడ్ హీరో అర్జున్ రామ్‌పాల్‌కి ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు. హీరో అర్జున్ రామ్‌పాల్ ప్రస్తుతం ‘డాడీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆయన ఒక డాన్ పాత్రలో కనిపిస్తారు. ఈ డాన్ పాత్ర అరుణ్ గావ్లీని పోలి వుంటుందని సమాచారం. 
 
కాగా ఈ పాత్రను రక్తికట్టంచడం కోసం అర్జున్ రామ్‌పాల్ డైరెక్టుగా అరుణ్ గావ్లీనే పరిశీలిస్తే ఓ పనైపోతుంది కదా అనుకున్నాడు. అదేసమయంలో అరుణ్ గావ్లీ అనారోగ్యంతో కొంతకాలం ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఆ విషయం తెలుసుకున్న అర్జున్, అరుణ్ గావ్లీని నేరుగా కలిసి చిత్రానికి సంబంధించి చర్చించారు. 
 
ఆ సమయంలో అర్జున్ కేవలం పాత్ర పోషణకు మాత్రమే అరుణ్ గావ్లీని కలిసినట్టు చెబుతున్నప్పటికీ ముంబై పోలీసులు మాత్రం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని అర్జున్ రామ్‌పాల్‌కి అరుణ్ గావ్లీతో సన్నిహిత సంబంధాలు ఉండే అవకాశం వుందని భావిస్తూ నోటీసులు జారీ చేశారు. ఈ సంఘటన ఆ సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సంగారెడ్డిలో గంజాయి.. 30 గుంటల్లో సాగు చేశారు.. చివరికి?

నెల్లూరు పరువు హత్య.. యువతిని చంపి.. ఇంటి వద్దే పూడ్చేశారు..

ప్లీజ్... ముందస్తు బెయిల్ ఇవ్వండి : హైకోర్టులో కాంతిరాణా టాటా పిటిషన్

రూ.320కే నెయ్యి వస్తుందని శ్రీవారి లడ్డూను కల్తీ చేశారు : సీఎం చంద్రబాబు

తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో నాణ్యతా లోపం లేదు : ఏఆర్ డెయిరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

అంజీర మిల్క్ తాగితే ప్రయోజనాలు ఏమిటి?

Show comments