Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్క డ్యూయల్ రోల్... శృతిహాసన్ గెస్ట్ రోల్... చిత్రం సైజ్ జీరో...

Webdunia
బుధవారం, 25 ఫిబ్రవరి 2015 (17:44 IST)
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వంలో పీవీపీ సినిమా సంస్థ ప్రసాద్‌ వి.పొట్లూరి నిర్మాతగా అనుష్క ప్రధాన పాత్రలో ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి 'సైజ్‌ జీరో' అనే పేరు పెట్టారు. ఈ చిత్రంలో అనుష్క ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు టాలీవుడ్ న్యూస్. అలాగే శృతిహాసన్ గెస్ట్ రోల్ లో కనిపిస్తున్నట్లు సమాచారం.

 
ఈ చిత్రం సోమవారంనాడు లాంఛనంగా హైదరాబాద్‌లోని పివిపి సంస్థ ఆఫీస్‌లో ప్రారంభమైంది. ముహర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించగా పివిపి సతీమణి ఝాన్సీ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. కణిక థిల్లాన్‌ కొవెలమూడి క్లాప్‌ కొట్టారు. డిఫరెంట్‌ కథాంశాలతో సినిమాలను నిర్మించి  తెలుగు ప్రేక్షకుల్లో ఓ సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న పివిపి నిర్మాణ సంస్థ రొమాంటిక్‌ కామెడి కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 
 
ఈ చిత్రంలో అనుష్క, ఆర్య, భరత్‌, ఊర్వశి ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. గ్లామరస్‌ హీరోయిన్‌ శృతిహాసన్‌ ఇందులో గెస్ట్‌ అప్పియరెన్స్‌ చేస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నారు. 
 
అనుష్క, ఆర్య, భరత్‌, ఊర్వశి ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిర్వాషా, ఆర్ట్‌: ఆనంద్‌సాయి, కథ-స్క్రీన్‌ప్లే: కణిక ధిల్లాన్‌ కొవెలమూడి, ఎగ్జిక్టూటివ్‌ నిర్మాత: సందీప్‌ గుణ్ణం, నిర్మాత: ప్రసాద్‌ వి.పొట్లూరి, దర్శకత్వం: ప్రకాష్‌ కొవెలమూడి.

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments