క్యాన్సర్ బారినపడి కన్నుమూసిన సీనియర్ నిర్మాత రామానాయుడు 1963లో 'అనురాగం' చిత్రం ద్వారా నిర్మాతగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. జగ్గయ్య, భానుమతి హీరో, హీరోయిన్లుగా నటించిన ఆ సినిమా అంతగా ప్రజాదరణను పొందకపోయినప్పటికీ పట్టువీడని విక్రమార్కుడిలా శ్రమించి 1965లో సొంత నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ ప్రారంభించి 'రాముడు-భీముడు' సినిమాను నిర్మించారు.
ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ మాసివ్ యాక్షన్, తాపీ చాణక్య దర్శకత్వ ప్రతిభ తోడవ్వడంతో ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతే అప్పటి నుంచి సినీ పరిశ్రమలో తిరుగులేని నిర్మాతగా రామానాయుడు వెలిగారు. అక్కడి నుంచి మొదలుపెట్టి ఏకంగా 155 సినిమాలు నిర్మించారు. ఆయన నిర్మించిన చివరి చిత్రం 'గోపాలా గోపాలా'.