Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంజలి ఆచూకీ ఎక్కడ.. మళ్లీ అమ్మడు అదృశ్యం! బాయ్‌ఫ్రెండ్‌తో..!

Webdunia
గురువారం, 14 మే 2015 (14:31 IST)
అంజలికి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మంచి పేరు సంపాదించిపెట్టినా.. ఆ గుర్తింపును సద్వినియోగం చేసుకోవడంలో అమ్మడు విఫలమైందనే చెప్పాలి. ఆ సినిమా రిలీజ్ తర్వాత.. వ్యక్తిగత కారణాలతో మీడియో నోళ్ళల్లో నానిన అంజలి.. ఆ మధ్య అదృశ్యమై.. వార్తల్లోకెక్కింది.

ఇదే తరహాలో ప్రస్తుతం మళ్లీ అంజలి అదృశ్యమైందని నెలరోజులగా షూటింగ్‌లకు డుమ్మా కొట్టిందని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వస్తోంది. తమిళంలో జయం రవి హీరోగా నటిస్తున్న అప్పాటక్కర్‌లో సెట్స్‌పై ఉండగానే యువ హీరో విమల్‌కు జోడిగా అంజలి ఎంపికైంది. ఇక అంజలి కెరీర్ గాడిలో పడ్డట్టేనని అనుకునేలోపే మరోసారి వివాదం కొనితెచ్చుకుంది. 
 
జయం రవి, విమల్ సినిమా షూటింగ్‌లకు అంజలి హాజరుకాకుండా అమెరికా ట్రిప్‌కు వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ తొలివారంలో వచ్చేస్తానని చెప్పి వెళ్లిన అంజలి ఇంతవరకు తిరిగి రాలేదట. మధ్యలో ఒకసారి ఫోన్‌లో సంప్రదిస్తే.. ఏప్రిల్ 20న వస్తానని చెప్పి.. ఆ మాటను కూడా నిలబెట్టుకోలేదట. దీంతో దర్శకనిర్మాతలు తలపట్టుకున్నారు.

ఇంకా అంజలి అప్పుడప్పుడు అదృశ్యం కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమ్మడు అప్పుడప్పుడు షూటింగ్‌లకు డుమ్మా కొట్టి అదృశ్యం కావడం వెనుక బాయ్ ఫ్రెండ్‌ ఉన్నాడని.. ఆయనతో చక్కర్లు కొట్టేందుకు అమ్మడు విదేశాలకు వెళ్తుందని టాక్ వస్తోంది. మరి అంజలి ఏమంటుందో వేచిచూడాలి.

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments