Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెట్‌పైకి వస్తున్న 'ఆంధ్ర పోరి'

Webdunia
శుక్రవారం, 23 జనవరి 2015 (20:51 IST)
దర్శకుడు రాజ్‌ మదిరాజు తను దర్శకత్వం వహిస్తున్న 'ఆంధ్రపోరి' చిత్రం ప్రారంభిస్తున్నట్లు చిత్రంలో ఎంపికైన నటీనటుల సమక్షంలో ప్రకటించారు. ఈ చిత్రం కోసం కొత్తవారిని ఎంపిక చేశారు. ప్రసాద్‌ ల్యాబ్‌లో శుక్రవారంనాడు ప్రకటిస్తూ.. ఈ నెల 27 నుంచి కొత్తగూడెం థర్మల్ పవర్‌ ప్లాంట్‌, భద్రాచలంలో చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు. 
 
ఈ చిత్రానికి మూలం మరాఠిలో విజయవంతమైన 'టైమ్‌పాస్‌' చిత్రం. దాన్ని రీమేక్‌ చేస్తున్నారు. ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌ బేనర్‌లో గతంలో 'రుషి' చిత్రాన్ని తీసిన రమేష్‌ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన రాజ్‌ మదిరాజ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈచిత్రంలో ప్రధాన పాత్ర ధారి పూరీ జగన్నాథ్‌ కుమారుడు ఆకాశ్‌ పూరి. 
 
మహేష్‌ బాబు, పవన్‌ కళ్యాణ్‌, రామ్‌ చరణ్‌ చిత్రాల్లో చైల్డ్‌ ఆర్టిస్టుగా వారి పాత్రలను పోషించాడు. ఇక జీటీవీలో 'ఝాన్సీ కీ రాణి'లో నటించిన ఉల్కాగుప్త ప్రధాన పాత్రధారిణిగా నటిస్తోంది. ఈ చిత్రంలో టీవీ నటుడు కృష్ణమూర్తి అయ్యంగార్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రవీణ్‌ వనమాలి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.ఈ చిత్రాన్ని వేసవి సెలవుల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

జగన్ వెనుకే జనం వున్నారు, భారీ విజయం సాధిస్తాం: సజ్జల జోస్యం

శ్రీశైలంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, కారణం ఏంటి?

గృహనిర్భంధంలో వైకాపా ఎమ్మెల్యేలు.. పల్నాడులో అప్రమత్తం

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

Show comments