Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లుడు శీను రివ్యూ రిపోర్ట్: స్టోరీ.. ప్లస్ నెగటివ్ పాయింట్స్!!

Webdunia
శనివారం, 26 జులై 2014 (12:51 IST)
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, ప్రకాష్‌రాజ్, తనికెళ్ల భరణి, రఘుబాబు, తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, 
సమర్పణ: బెల్లకొండ సురేష్,
నిర్మాత: బెల్లంకొండ గణేష్‌బాబు,
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.
 
అల్లుడు శీనుకు యావరేజ్ స్కోర్ పాయింట్స్ లభించాయి. యావరేజ్‌గా అల్లుడు శీనును ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. వి.వి.వినాయక్ కమర్షియల్ పాయింట్ ఓకే కానీ.. చాలా నెగటివ్ పాయింట్సే కోకొల్లలుగా ఉన్నాయని టాక్ వస్తోంది. గ్లామర్ క్వీన్,  స్టార్ హీరోయిన్ అందాలు ఆరబోసినా.. ఆది ఓపెనింగ్ డాన్స్‌లు, ఫైట్స్ అదిరిపోయినా ఫలితం లేకుండా పోయింది. స్టార్ విలన్, స్టార్ కమెడియన్, స్టార్ హీరోయిన్ తమన్నా ఐటమ్ సాంగ్ ఇన్నీ వున్నా.. అల్లుడు శీనుకు ఏదో లోటు వుండనే వుందని సినీ పండితులు అంటున్నారు. 
 
ఖర్చుకి వెనకాడకుండా డబ్బుని పోసేసినా., బెల్లం కొండ తన కుమారుడు ఎంట్రీని గ్రాండ్‌గా చేయడానికి పన్నిన వ్యూహం జనాల్ని థియేటర్ వరకు రప్పించడంలో అద్భుతంగా పనిచేసింది. కొత్త హీరో అయినా ఓపినింగ్స్ రాబట్టడంతో సఫలమైంది. అయితే ఎంటర్‌టైన్ చేయడంలో వినాయక్ మిస్సయ్యాడు. కొత్త హంగులు సమకూరినా.. కథ కూర్పులో కాస్త లోటు ఉంది. 
 
ఫస్టాఫ్ కామెడీతో కొట్టుకుపోయినా, సెకండాఫ్ సరైన విలన్‌కి హీరోకి మధ్య కాంఫ్లిక్ట్ ఎస్టాబ్లిష్ కాక... విలన్ డమ్మిగా మారి... కథ ఎక్కడ వేసిన సీన్ అక్కడే ఉన్నట్లు అక్కడక్కడే తిరుగుతూ విసిగించింది. అప్పటికీ వినాయిక్ తనదైన శైలి టేకింగ్‌తో, బ్రహ్మీ కామెడీతో లాక్కెళ్లే ప్రయత్నం చేసినా నో యూజ్.  
 
కథలోకి వెళితే.. 
నల్గొండలో ఉండే అల్లుడు శీను (బెల్లంకొండ శ్రీనివాస్) తన మామ నరసింహా (ప్రకాష్ రాజ్)తో కలిసి అప్పులు పాలై , పారిపోయి హైదరాబాద్ సిటీకి వచ్చేస్తాడు. అల్లుడు శీనుకు తన మామ పోలికలతోనే సెటిల్‌మెంట్స్ చేస్తూ బతికే లోకల్ డాన్ భాయ్ (ఇంకో ప్రకాష్ రాజ్) కనిపిస్తాడు. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్న శీను.. మామ గెటప్ మార్చేసి భాయ్‌గా మార్చేసి దంగా చేస్తూ డబ్బు సంపాదిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న భాయ్ ఏం చేస్తాడు.. భాయ్‌కి నరసింహా, అల్లుడు శీనుకు ఏం సంబంధం.. భాయ్ కూతురు అంజలి (సమంత) శ్రీను ప్రేమలో ఎలా పడింది. అంజలిని ఎలా సొంతం చేసుకున్నాడు...డింపుల్‌గా ఈ చిత్రంలో బ్రహ్మానందం పాత్ర ఏమిటి అనే విషయాలు తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments