Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే ఆయన సరసకు నో చెప్పా.. అక్షర వెల్లడి..!

Webdunia
ఆదివారం, 1 ఫిబ్రవరి 2015 (17:57 IST)
టాలీవుడ్ బిగ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ చిక్కిందంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేయాల్సిందే. అయితే అంతటి అవకాశం వచ్చినా నటి అక్షర మాత్రం సున్నితంగా నిరాకరించిందట. ఇక అసలు విషయానికొస్తే కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి ఒక్క హిట్టు కూడా లేని శృతి హాసన్ గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ సరసన నటించి హిట్ కొట్టడంతో ఒక్క సారిగా స్టార్ హీరోయిన్ అయ్యిందన్న విషయం అందరికీ తెలిసిందే.
 
కాగా త్వరలో గబ్బర్ సింగ్ 2 కూడా మొదలు పెట్టనున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన నటించేందుకు శృతి హాసన్ చెల్లెలు అక్షరను హీరోయిన్‌గా ఎంపిక చేయాలనుకున్నారు. కానీ, అక్షర ఈ అవకాశాన్ని నిరాకరించిందట. ఈ విషయం గురించి అక్షర మాట్లాడుతూ.. తాను సినీ లోకంలో నటిగా ఇప్పుడిప్పుడే అడుగులు వెస్తున్నాననంది. ఒక్క సారిగా అంత పెద్ద హీరోతో చేస్తే అంచనాలు భారీగా ఉంటాయి. అయితే  అందుకు తగిన విధంగా మన పర్ఫామెన్స్ కూడా ఉండాలి కదా. ఒక వేల ఆయన స్థాయికి తగినట్టుగా లేకపోతే బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది. అందుకనే ఆయనతో నటించే ఛాన్స్‌ను వదులుకున్నానని అక్షర వివరించింది.
 
ప్రస్తుతం అమ్మడు  ప్రస్తుతం అక్షర షామితాబ్ సినిమాలో ధనుష్, అమితాబ్ తో కలిసి నటిస్తుంది. ఇక అక్షర కుదరదనడంతో గబ్బర్ సింగ్ 2లో హీరోయిన్‌గా అనీష ఆంబ్రోస్‌ ను ఎంపిక చేసినట్లు సమాచారం.
 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments