Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదాశర్మకు టాలీవుడ్‌లో ఫుల్ ఆఫర్స్!: మంచు విష్ణు సరసన..?

Webdunia
శనివారం, 1 నవంబరు 2014 (11:53 IST)
ఆదాశర్మకు టాలీవుడ్‌లో ఫుల్ ఆఫర్స్ వస్తున్నాయి. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'హార్ట్ ఎటాక్' తో ఈ ఏడాది టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన అదాశర్మకు తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి. 
 
ఇప్పటికే, త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా ఆమె నటిస్తోంది. దీంతో పాటు, ఆది హీరోగా 'పెళ్లైన కొత్తలో' ఫేం మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా హీరోయిన్‌గా ఎంపికైంది.
 
ఈ రెండు చిత్రాలతో పాటు తాజాగా, మంచు విష్ణు హీరోగా దేవా కట్ట దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఈ ఏడాది తమిళంలో సూపర్ హిట్టైన 'అరిమా నంబి'కి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. 
 
తెలుగు చిత్రాలతో పాటు ఆమె ప్రస్తుతం ఓ కన్నడ చిత్రంలో కూడా హీరోయిన్ గా చేస్తోంది. పవన్ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా రూపొందుతున్న 'ధీర రణ విక్రమ'లో ఆమె హీరోయిన్‌గా నటిస్తుంది.

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments