Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ 'కత్తి'కి పట్టిన తుప్పును సెంటిమెంట్‌తో వదిలిస్తాం.. మురగదాస్

Webdunia
బుధవారం, 22 అక్టోబరు 2014 (08:58 IST)
తమిళ హీరో విజయ్, సమంతా నటించిన తాజా చిత్రం 'కత్తి'. ఈ చిత్రం విడుదలకు ముందే ఎన్నో ఆంటకాలకు గురవుతోంది. ఫలితంగా పైసా ఖర్చు లేకుండానే మంచి పబ్లిసిటీని కూడా సొంతం చేసుకుంటోంది. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ రూపొందిస్తున్న ఈ సినిమాను అదే పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. 
 
ఈ చిత్రంపై దర్శకుడు మురుగదాస్, హీరో విజయ్‌లు మాట్లాడుతూ టైటిల్ని బట్టి ఇదేదో యాక్షన్ సినిమా అనుకుంటారనీ, అయితే ఇది పూర్తి యాక్షన్ ఫిలిం కాదనీ వివరించాడు. హృదయాలను హత్తుకునే సెంటిమెంటు, డ్రామా కూడా ఉన్నాయనీ, వినోదం పాలు కూడా ఎక్కువేననీ చెప్పారు.
 
ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఆడియో వేడుకను ఈ నెల 24న హైదరాబాదులో నిర్వహిస్తున్నారు. చిత్రాన్ని ఈ నెల 31వ తేదీన రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 'తుపాకి' తర్వాత మురుగదాస్, విజయ్ కాంబినేషన్‌లో ఈ సినిమా వస్తుండడంతో మంచి క్రేజ్ వుంది. అలాగే, సమంతా గ్లామర్ కూడా దానికి తోడవుతోంది. 
 
కాగా, ఈ చిత్రానికి శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజపక్సే సోదరుడు ఫైనాన్స్ చేసినట్టు ఆరోపణలు రావడంతో అనేక సమస్యల్లో చిక్కుకుంది. ఫలితంగా ఈ చిత్రం చెన్నైలో విడుదల కానున్న ప్రముఖ థియేటర్‌పై కొందరు ఎల్టీటీఈ సానుభూతిపరులు దాడి చేసి అద్దాలను కూడా ధ్వంసం చేశారు. అయినప్పటికీ ఈ చిత్రాన్ని అనుకున్న సమయానికి విడుదల చేస్తామని హీరో, దర్శకుడు వెల్లడించారు. 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments