Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాటితరం నటుడు ముక్కురాజు మృతి

Webdunia
గురువారం, 31 జులై 2014 (18:54 IST)
బ్లాక్‌ అండ్‌ సినిమాల నుంచి అగ్రహీరోలకు నృత్యాలు నేర్పి, వారితోపాటు కలిసి నటించిన ముక్కురాజు గురువారంనాడు కన్నుమూశారు. కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా తనదైన బాణిలో రాణించారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం ఉదయం హైదరాబాద్‌లోని తన ఇంటిలోనే తుదిశ్వాస విడిచారు. 
 
80,90 దశకాలలో పలు చిత్రాలకు పనిచేశారు. 'ఎర్రసైన్యం' వంటి చిత్రాల్లో నటించారు. ఆర్‌. నారాయణమూర్తి చిత్రాల్లో ఎక్కువగా కన్పించేవారు. తాజాగా ఆయన నటించిన చిత్రం '1940లో ఒక గ్రామం'. ఈ చిత్రం పలు అవార్డులకు నోచుకుంది. వృద్ధాప్యం కారణంగా ఆయనకు సరైన అవకాశాలు దక్కలేదు. దీంతో ఇంటిదగ్గరే వుంటున్నారు. సినీప్రముఖులు కొద్ది మంది ఇచ్చే చేయూతతో ఆయన జీవితాన్ని వెళ్ళదీస్తున్నట్లు తెలిసింది. ఆయన మృతి పట్ల సినీరంగ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు.

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments