Webdunia - Bharat's app for daily news and videos

Install App

2006కు నంది అవార్డుల ప్రకటన

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2008 (20:37 IST)
రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డుల ఎంపిక కమిటీ 2006 సంవత్సరానికి సంబంధించి ఉత్తమ చిత్రంగా బొమ్మరిల్లు, ఉత్తమ నటుడుగా అక్కినేని నాగార్జున, ఉత్తమ నటిగా నందితా దాస్ ఎంపికైనట్లు, ఇతర వివరాలను చలనచిత్ర అవార్డుల జాబితాను జ్యూరీ ఛైర్మన్ యంఎస్‌రెడ్డి ప్రకటించారు. బుధవారం ఫిలిమ్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... సాంకేతికంగా, కళాత్మకంగా తెలుగు చలనచిత్రాలకు, దర్శకులకు, కళాకారులకు, సాంకేతిక నిపుణులకు బంగారు, వెండి, కాంస్య, తామ్ర నందుల రూపంలో ఇవ్వటంతోపాటు ఐదువేల నుండి లక్ష రూపాయల వరకూ బహుమతులు ఇవ్వటం జరగుతుందన్నారు.

మొత్తం 54 ఎంట్రీలు వచ్చాయనీ, డాక్యుమెంటరీ చిత్రాలు మూడు వచ్చినప్పటికీ అర్హత సాధించలేదని తెలిపారు. విద్యకు సంబంధించిన చిత్రం ఒక్కటి కూడా రాలేదన్నారు. ప్రకటించిన 44 అవార్డుల్లో బొమ్మరిల్లు 7, గోదావరి, పోకిరి చెరో నాలుగు అవార్డులను కైవశం చేసుకోవటం గమనార్హం. ఉత్తమ హాస్య నటుడు అవార్డును అల్లు రామలింగయ్య పేరు మీద ప్రకటిస్తున్నామని చెప్పారు.

ప్రధమ ఉత్తమ చిత్రం... బొమ్మరిల్లు
ద్వితీయ ఉత్తమ చిత్రం.... గోదావరి
తృతీయ ఉత్తమ చిత్రం... గంగ
కుటుంబ సమేతంగా చూడదగ్గ ఉత్తమ చిత్రం... శ్రీరామదాసు
ఉత్తమ జనరంజక చిత్రం... పోకిరి
జాతీయ సమైక్యతను చాటిన చిత్రం... హనుమంతు
ప్రధమ ఉత్తమ బాలల చిత్రం... భారతి
ద్వితీయ ఉత్తమ బాలల చిత్రం... కిట్టు
బాలల చిత్ర ఉత్తమ దర్శకుడు... ఆర్ఎస్ రాజు
తెలుగు చిత్రాల గ్రంథం... నాటి 101 చిత్రాలు (ఎస్వి రామారావు)
తెలుగు సినిమా ఉత్తమ విమర్శకులు... చల్లా శ్రీనివాస్
ఉత్తమ నటుడు... అక్కినేని నాగార్జున (శ్రీరామదాసు)
ఉత్తమ నటి... నందితా దాస్ ( కమ్లి)
ఉత్తమ సహాయ నటుడు.. ప్రకాష్ రాజ్ (బొమ్మరిల్లు)
ఉత్తమ సహాయ నటి.. ఈశ్వరి (గంగ)
ఉత్తమ క్యారెక్టర్ నటుడు.... కోట శ్రీనివాసరావు (పెళ్లయిన కొత్తలో)
ఉత్తమ హాస్యనటుడు... వేణు మాధవ్ (లక్ష్మి)
ఉత్తమ హాస్య నటి... అభినయశ్రీ
ఉత్తమ విలన్... సాయి కుమార్ (సామాన్యుడు)
ఉత్తమ బాల నటుడు... మాస్టర్ రాఘవ( స్టైల్)
ఉత్తమ బాల నటి... బేబీ శ్రీదివ్య (భారతి)
మొదటి ప్రయత్నంలో ఉత్తమ దర్శకులు.... భాస్కర్ (బొమ్మరిల్లు)
ఉత్తమ స్క్రీన్‌ప్లే రచన... భాస్కర్ (బొమ్మరిల్లు)
ఉత్తమ కథారచయిత... రవి సి. కుమార్( సామాన్యుడు)
ఉత్తమ డైలాగ్ రచయిత.. అబ్బూరి రవి(బొమ్మరిల్లు)
ఉత్తమ గీత రచయిత... అందెశ్రీ (గంగ)
ఉత్తమ ఛాయా గ్రహకుడు... విజయ్ కుమార్ సి(గోదావరి)
ఉత్తమ గాయకుడు... జెసుదాస్(గంగ)
ఉత్తమ గాయని... సునీత (గోదావరి)
ఉత్తమ ఎడిటర్.. మార్తాండ కె. వెంకటేష్ (పోకిరి)
ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్.. అశోక్ (పౌర్ణమి)
ఉత్తమ నృత్య దర్శకులు.. రాఘవ లారెన్స్
ఉత్తమ ఆడియోగ్రాఫర్... రాధాకృష్ణ (పోకిరి)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్... బాషా (శ్రీరామదాసు)
ఉత్తమ మేకప్ ఆర్టస్ట్... బి. రామచంద్రరావు
ఉత్తమ ఫైట్ మాస్టర్.. విజయన్ (పోకిరి)
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టు... రవిశంకర్ (పోకిరి)
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ (మహిళ)... సవితారెడ్డి(బొమ్మరిల్లు
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్... నిపుణ- స్పిరిట్ (సైనికుడు)

ప్రత్యేక జ్యూరీ అవార్డులు
చిత్రం ... స్టాలిన్
నటి... జెనీలియా(బొమ్మరిల్లు)
టెక్నీషియన్... గుణ్ణం గంగరాజు (అమ్మ చెప్పింది)

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments