Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్‌ను చేస్తానని చెప్పి గర్భవతిని చేసిన డైరెక్టర్

Webdunia
శనివారం, 7 డిశెంబరు 2013 (12:11 IST)
FILE
హీరోయిన్‌ను చేస్తానని చెప్పి జూనియర్ ఆర్టిస్టును గర్భవతిని చేసిన డైరెక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరిట తనను నమ్మించి మోసం చేశాడని సదరు నటి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈరోజు తెల్లవారు జామున ఆ డైరెక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సినిమాలో హీరోయిన్‌‌గా అవకాశం ఇస్తానంటూ సినిమా దర్శకుడు చాంద్ పాషా తనను మోసం చేసి.. గర్భవతిని చేశాడని శ్రీజ అనే జూనియర్ ఆర్టిస్టు హైదరాబాద్‌లోని నాచారం పోలీసులను ఆశ్రయించింది. ప్రేమ పేరిట గత ఆరు నెలలుగా తనను మోసం చేశాడని వాపోయింది. చాంద్ పాషాకు గతంలోనే పెళ్లయ్యి, ఇద్దరు పిల్లలున్నారు. మళ్లీ తనను కూడా పెళ్లి చేసుకుంటానని చెప్పాడని ఆమె చెప్పింది.

ఖమ్మం జిల్లా కొత్తగూడెం ప్రాంతానికి చెందిన శ్రీజను లవ్ ఈజ్ గేమ్ అనే సినిమాలో హీరోయిన్ చేస్తానని అతడు మోసగించినట్లు తెలిపింది. ఇంతకుముందు అతడు లవ్ సిలబస్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. పోలీసులు శనివారం తెల్లవారుజామున చాంద్ పాషాను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments