Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సెన్సార్‌ పూర్తి... క్లీన్ U సర్టిఫికేట్

Webdunia
మంగళవారం, 8 జనవరి 2013 (18:38 IST)
WD
విక్టరీ వెంకటేష్‌, సూపర్‌స్టార్‌ మహేష్‌ అన్నదమ్ములుగా నటిస్తున్న చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సెన్సార్ పూర్తయి క్లీన్ U సర్టిఫికేట్ పొందింది. సూపర్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శ్రీమతి అనిత సమర్పణలో నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్‌ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' జనవరి 11న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ కాబోతోంది.

ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ''మా చిత్రం సెన్సార్‌ పూర్తయింది. ఒక్క కట్‌ కూడా లేకుండా క్లీన్‌ 'యు' సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఈమధ్య కాలంలో ఒక కట్‌ కూడా లేకుండా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని తీసినందుకు సెన్సార్‌ ఆఫీసర్‌ ఎంతగానో అభినందించారు. క్లైమాక్స్‌లో ఏడిపించారు. చాలా హార్ట్‌ టచ్చింగ్‌గా వుంది అని ముగ్గురు లేడీ మెంబర్స్‌ అభినందించారు. ఈ సినిమా ఆరు నెలలకుపైగా ఆడుతుంది. చాలా గొప్ప సినిమా తీసారు.

ఆరు నెలలకు పైగా ఆడుతుందని ఇద్దరు మెంబర్స్‌ ప్రశంసించారు. దాదాపు 25 ఏళ్ళ తర్వాత వస్తున్న ఈ మల్టీస్టారర్‌ ఈ సంక్రాంతికి మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా జనవరి 11న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాము. తప్పకుండా అందరి ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఈ సినిమా రీచ్‌ అవుతుంది. మా బేనర్‌ పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలవుతున్న ఈ చిత్రం మా బేనర్‌ ప్రెస్టేజ్‌ మరింత పెంచుతుంది. ఈ మల్టీస్టారర్‌ ఇంత బాగా రావడానికి దోహదపడిన వెంకటేష్‌ బాబుకి, మహేష్‌బాబుకి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను'' అన్నారు.

విక్టరీ వెంకటేష్‌ మాట్లాడుతూ - ''చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఎక్స్‌ట్రార్డినరీ పాయింట్‌తో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతికి పర్‌ఫెక్ట్‌ మూవీ. కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్‌ చేసే విధంగా వుంటుంది. మహేష్‌తో కలిసి ఇంత మంచి సినిమాలో నటించడం చాలా హ్యాపీగా వుంది'' అన్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌ మాట్లాడుతూ - ''శ్రీకాంత్‌ చెప్పిన సబ్జెక్ట్‌ విని ఎంతో ఇన్‌స్పైర్‌ అయ్యాను. ఈ సినిమా చేయడం మంచి అనుభూతిని కలిగించింది. మూడు రోజుల ముందే సంక్రాంతి పండగ వచ్చినంత ఆనందం అభిమానుల్లో కనిపిస్తోంది. అన్నివిధాలా సంతృప్తిని కలిగించిన సినిమా ఇది. వెంకటేష్‌గారితో ఇంత మంచి సినిమాలో నటించడం చాలా ఆనందాన్ని కలిగించింది'' అన్నారు.

విక్టరీ వెంకటేష్‌, సూపర్‌స్టార్‌ మహేష్‌, సమంత, అంజలి, ప్రకాష్‌రాజ్‌, జయసుధ, రోహిణి హట్టంగడి, అభినయ, కోట శ్రీనివాసరావు, వేణుమాధవ్‌, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, రావు రమేష్‌, ఆహుతి ప్రసాద్‌ రవిబాబు, రాజారవీందర్‌, సుమిత్‌ అరోరా, రమాప్రభ, రజిత, శ్రీనివాస్‌రెడ్డి, ప్రభాస్‌ శ్రీను, బ్రహ్మాజీ, మేలొక్కటె, ఆర్‌.జె. హేమంత్‌, ఢిల్లీ రాజేశ్వరి, మురళీమోహన్‌, దేవిశ్రీ, ఐడిపిఎల్‌ నిర్మల, కల్పలత, కల్పిక, భువన, తేజస్విని, రచన, నరేష్‌, ప్రవీణ్‌, గిరిధర్‌, కోలా శ్రీను, సత్యదేవ్‌, వెన్నెల రామారావు, హరీష్‌, హేమంత్‌, అనురాధ, సర్వమంగళ, ల్యాబ్‌ శరత్‌, హరిచరణ్‌, డ ా|| శైలజ, లలిత, అపర్ణ, శ్రావణి, అర్జున్‌, సంతోష్‌, అర్జున్‌ ఉదయ్‌కుమార్‌, సోహైల్‌, ఫణి, రాజబాబు, కోటేశ్వరరావు, కాటంరెడ్డి, గౌరేశ్వరరావు, బిహెచ్‌ఇఎల్‌ ప్రసాద్‌, సురేష్‌కుమార్‌, ఇందూఆనంద్‌, కిరణ్‌, డ ా|| అనిల్‌కుమార్‌, చందనచక్రవర్తి, రాఘవేంద్ర, ఆనంద్‌వర్మ ఈ చిత్రంలో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: కె.వి.గుహన్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: రవికుమార్‌ పిళ్ళ, ఫైట్స్‌: విజయ్‌, కో-డైరెక్టర్‌: రెడ్డి తరణీరావు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: జి.నాగేశ్వరరావు, కో-ప్రొడ్యూసర్స్‌: శిరీష్‌, లక్ష్మణ్‌, నిర్మాత: దిల్‌రాజు, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments