Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సెన్సార్‌ పూర్తి... ఒక్క కట్ లేదన్న దిల్ రాజు

Webdunia
మంగళవారం, 8 జనవరి 2013 (19:10 IST)
WD
విక్టరీ వెంకటేష్‌, సూపర్‌స్టార్‌ మహేష్‌ అన్నదమ్ములుగా నటిస్తున్న చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సెన్సార్ పూర్తయి క్లీన్ U సర్టిఫికేట్ పొందింది. సూపర్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శ్రీమతి అనిత సమర్పణలో నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్‌ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' జనవరి 11న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ కాబోతోంది.

ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ''మా చిత్రం సెన్సార్‌ పూర్తయింది. ఒక్క కట్‌ కూడా లేకుండా క్లీన్‌ 'యు' సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఈమధ్య కాలంలో ఒక కట్‌ కూడా లేకుండా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని తీసినందుకు సెన్సార్‌ ఆఫీసర్‌ ఎంతగానో అభినందించారు. క్లైమాక్స్‌లో ఏడిపించారు. చాలా హార్ట్‌ టచ్చింగ్‌గా వుంది అని ముగ్గురు లేడీ మెంబర్స్‌ అభినందించారు. ఈ సినిమా ఆరు నెలలకుపైగా ఆడుతుంది. చాలా గొప్ప సినిమా తీసారు.

ఆరు నెలలకు పైగా ఆడుతుందని ఇద్దరు మెంబర్స్‌ ప్రశంసించారు. దాదాపు 25 ఏళ్ళ తర్వాత వస్తున్న ఈ మల్టీస్టారర్‌ ఈ సంక్రాంతికి మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా జనవరి 11న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాము. తప్పకుండా అందరి ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఈ సినిమా రీచ్‌ అవుతుంది. మా బేనర్‌ పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలవుతున్న ఈ చిత్రం మా బేనర్‌ ప్రెస్టేజ్‌ మరింత పెంచుతుంది. ఈ మల్టీస్టారర్‌ ఇంత బాగా రావడానికి దోహదపడిన వెంకటేష్‌ బాబుకి, మహేష్‌బాబుకి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను'' అన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments