Webdunia - Bharat's app for daily news and videos

Install App

"సలీం" ద్వారా రిలయన్స్ ప్రవేశం

Webdunia
WD
శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ రూపొందిస్తోన్న 50వ చిత్రం "సలీం" ద్వారా కార్పొరేట్ సంస్థ రిలయన్స్ కంపెనీ తెలుగు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. "బిగ్ పిక్చర్స్" పేరుతో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌తో సంయుక్తంగా "సలీం" చిత్రాన్ని రూపొందిస్తోంది. మంచు విష్ణువర్ధన్ బాబు, ఇలియానా జంటగా నటిస్తోన్న ఈ చిత్రానికి వై.వి.ఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు.

గత కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మోహన్ బాబు మాట్లాడుతూ... లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌తో కలిసి రిలయన్స్ సంస్థ తెలుగు సినీ రంగంలోకి ప్రవేశించడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. తమ సంస్థతో రెండు చిత్రాలు నిర్మించే ఆలోచనలో వారు ఉన్నారని, కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చి మంచి చిత్రాలు నిర్మిస్తే మంచే జరుగుతుందని తెలిపారు.

చిత్రం గురించి ఆయన చెబుతూ... నాలుగు రోజులుగా రామోజీ ఫిలింసిటిలో షూటింగ్ జరుగుతోందని, ఫిలింసిటీలో 30లక్షలతో పాటకోసం సెట్ వేశామని, సుచిత్రా చంద్రబోస్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారని చెప్పారు.

బిగ్ పిక్చర్స్ ఆపరరేటివ్ ఆర్గనైజర్ మహేష్ మాట్లాడుతూ... లక్ష్మీ ప్రసన్న నిర్మించే 50వ చిత్రంద్వారా నిర్మాణ రంగంలో అడుగుపెట్టడం ఆనందంగా ఉందని, దేశ సినీ రంగంలో హిందీ, తెలుగుదే పైచేయి అని, మంచి మార్కెట్ తెలుగు ఇండస్ట్రీకి ఉందని వెల్లడించారు. భవిష్యత్‌లో అనేక సినిమాలు నిర్మిస్తామని, 9 భాషల్లో చిత్రాలు నిర్మించే ఆలోచనలో ఉన్నామని మహేష్ తెలిపారు.

జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ... విష్ణుతో "ఢీ" చిత్రం చేశానని, నటుడిగా విష్ణు ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. వై.వి.ఎస్. చిత్రాలన్నింటిలోకల్లా తనకు సంతృప్తినిచ్చే పాత్రను సలీంలో పోషిస్తున్నానని చెప్పారు.

నటి హేమ మాట్లాడుతూ... సంక్రాంత్రినాటికి యుఎస్‌లో షూటింగ్ జరుగనుందని, పండుగ అక్కడే జరుపుకుంటామని చెప్పారు. మార్చిలో సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు. మతాలకు కులాలకు అతీతంగా పెట్టిన పేరు "సలీం"మని అటువంటి చిత్రంలో మంచి పాత్ర ద్వారా ముందుకు రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. సినిమా విజయవంతం కావాలని ఎం.ఎస్. నారాయణ ఆకాంక్షించారు. ఇంకా ఈ చిత్రానికి కెమెరా... రాంప్రసాద్, మాటలు.. రవి.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments