Webdunia - Bharat's app for daily news and videos

Install App

'షాడో' విడుదల మార్చి 27... ఫ్రెష్‌గా కనిపిస్తా... వెంకటేష్

Webdunia
సోమవారం, 28 జనవరి 2013 (21:42 IST)
WD
వెంకటేష్ నటించిన షాడో చిత్రం రిలీజ్ డేట్ మార్చి 27 కన్ఫర్మ్ అయింది. ఈ చిత్రంలో శ్రీకాంత్ తోపాటు, తాప్సీ, మధురిమలు నటిస్తున్నారు. షాడో గురించి వెంకీ చెపుతూ... మాస్‌ చిత్రాలంటే కేవలం మాసేకాదు.. ఫ్యామిలీస్‌ కూడా చూసే చిత్రాలు... నేను నటించే చిత్రం అలా ఉంటుందని వెంకటేష్‌ చెప్పారు. శ్రీకాంత్‌తో కలిసి నటించిన చిత్రం షాడో. తాప్సీ, మధురిమ నటీమణులు. మెహర్‌ రమేష్‌ దర్శకుడు. పరుచూరి శివరామప్రసాద్‌ నిర్మాత. కిరీటీ సమర్పణ.

ఈ చిత్రం గురించి వెంకటేష్‌ మాట్లాడుతూ, మెహర్‌ రమేష్‌ ఈ సినిమాకు పూర్తి జస్టిఫై చేశారు. క్వాలీటీ కోసం కష్టపడుతున్నారు. నన్ను కొత్తగా చూపించాలని పాత్రను డిజైన్‌ చేశారు. అదే ప్రెష్‌నెస్‌ కన్పిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా ఎంజాయ్‌ చేసేట్లు చిత్రం ఉంటుంది. సీతమ్మ వాకిట్లో... తర్వాత పూర్తి భిన్నమైన సినిమా ఇది. ట్రైలర్స్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మార్చి 27న సినిమా విడుదలవుతుంది అన్నారు.

దర్శకుడు మెహర్‌ మాట్లాడుతూ, గత ఏడాది జనవరి 26న సినిమాను ప్రారంభించాం. గ్లామర్‌గానే కాదు హ్యూమరస్‌గానూ ఉంటుంది. స్టైల్‌తో పాటు సబ్‌స్టెన్స్‌ కూడా ఉంది. వెంకటేష్‌ గారితో పూర్తిస్థాయి కమర్షియల్‌, మాస్‌ చిత్రం చేయాలనుకున్నా. హీరో ఇంట్రడక్షన్‌ ట్రెండ్‌ సెట్టర్‌ అవుతుంది. పిల్లలు, మహిళలు, పెద్దలు అన్న తేడా లేకుండా అందరూ మెచ్చేలా ఉంటుంది అన్నారు. మలేషియాలో ఫైట్స్‌ బిల్లాను మించిపోతాయి. ఇందులో ఎం.ఎస్‌. నారాయణ మూడో హీరో అని చెప్పారు.

నాగబాబు మాట్లాడుతూ, వెంకటేష్‌ను కుటుంబకథా చిత్రాల్లో ఎక్కువగా చూశాం. దర్శకుడిలో దమ్ముండాలే గానీ ఆయన ఘర్షణ లాంటి సినిమాలను చాలానే చేయగలరు. ఈ సినిమా అంత గొప్పగా ఉంటుంది. ఈ ఏడాది వెంకటేష్‌ తప్పకుండా మరో హిట్‌ కొడతారు. నిర్మాత తపన గల వ్యక్తి అని చెప్పారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments