Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రియ నటించిన పవిత్ర.. బూతు సినిమా కాదు!

Webdunia
సోమవారం, 3 జూన్ 2013 (18:10 IST)
File
FILE
ప్రముఖ హీరోయిన శ్రియ నటించిన తాజా చిత్రం పవిత్ర. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఇదేదో బూతు సినిమా అని అనుకుంటున్నారు. అసలు ఇది బూతు సినిమా కాదు. పవిత్రమైన సినిమా అందుకే పవిత్ర అని పేరు పెట్టినట్టు దర్శకుడు జనార్ధన్ మహర్షి అంటున్నారు.

ఆదేశ్‌ ఫిలింస్‌ పతాకంపై కె.సాధక్‌ కుమార్‌, జి.మహేశ్వర రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. సాయికుమార్‌, రోజా, తనికెళ్ళ భరణి, కౌషిక్‌ బాబు ఇతర పాత్రలు పోషించారు. నిర్మాణాంతర కార్యక్రమాలన్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 7వ తేదిన విడుదలకు సిద్దమైంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను గురించి చెబుతూ...

' దేవస్థానం' వంటి ఒక అద్భుతమైన చిత్రాన్ని తీసిన నువ్వు.. ఇలాంటి సినిమాను ఎందుకు రూపొందిస్తున్నావంటూ చాలా మంది నన్ను ప్రశ్నించారు. కొంతమందైతే ఇదేదో బూతు సినిమా అంటూ వ్యగ్యాస్త్రాలు సంధించారు. స్వీట్‌ షాపులో స్వీట్‌తో పాటు హాట్‌ కూడా ఉంటుంది. అలాంటిదే ఈ చిత్రం కూడా.

నా దర్శకత్వంలో వచ్చిన దేవస్థానం చిత్రం తిరుపతి లడ్డూలాంటిది. ఈ చిత్రం మిరపకాయ బజ్జీలాంటిది. దేహం మలినం కావచ్చు కానీ మనసు నిర్మలంగా ఉండాలి. ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నో బాధలు, కష్టాలు ఎదుర్కోని వేశ్యగా మారిన ఓ అమ్మాయి పాలిటిక్స్‌లోకి ఎందుకెళ్ళాలనుకుంది అనేది చిత్రం కథాంశం.

దేహాన్ని అమ్ముకున్న ఓ వేశ్యకు దేశాన్ని అమ్ముకుంటున్న రాజకీయ నాయకులకు మధ్య జరిగే 20-20 మ్యాచే మా పవిత్ర చిత్రం. అసలు ఈ కథని కన్నడలో పూజా గాంధీతో రూపొందించేందుకు సన్నాహాలు చేసుకుంటుండగా మా నిర్మాతలు ఈ కథను విని, ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మించేందుకు ముందుకొచ్చారు. అలా ఈ సినిమా ప్రారంభమైంది. అన్నారు.

శ్రియ అయితేనే ఈ పాత్రకు న్యాయం చేయగలదనే నమ్మకంతో ఆమెను ఎంపిక చేశాం. శ్రియ హీరోయిన్‌గా కావాలనగానే మా నిర్మాతలు ఆమె డేట్స్‌ తీసుకున్నారు. మొదట స్టోరీ లైన్‌ చెప్పగానే ఆమె చాలా భయపడింది. స్టోరీ మొత్తం విపులంగా వివరించాక నటించడానికి ఓకే అంది. నేను ఆశించిన విధంగానే శ్రియ తన పాత్రకు 100 శాతం న్యాయం చేసింది. అన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments