Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుణ్ సందేశ్ : అప్పట్లో శ్రద్దా దాస్.... ఇప్పుడు హరిప్రియతో రొమాన్స్

Webdunia
బుధవారం, 5 జూన్ 2013 (12:09 IST)
File
FILE
' కొత్త బంగారులోకం' సినిమాతో లవర్‌బాయ్‌గా పేరు తెచ్చుకున్న యంగ్ హీరో వ‌రుణ్ సందేశ్ ఇప్పుడు నిజ జీవితంలోనూ లవర్‌బాయ్ అయ్యాడని అంటున్నాయి ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు. గ‌తంలో శ్రద్దాదాస్‌తో డీప్ ల‌వ్‌స్టోరి నడిపిన వ‌రుణ్.. ఆ త‌రువాత ఎందుకో అమ్మడిని వ‌ద‌లేశాడు. అప్పట్లో శ్రద్దా దాస్ వ‌రుణ్ న‌న్ను వాడుకోని వ‌ద‌లేశాడ‌ని ఇన్ డైరెక్ట్‌గా త‌న ఆవేద‌నను వ్యక్తం చేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఇపుడు వ‌రుణ్ సందేశ్ తాజాగా హీరోయిన్ హ‌రిప్రియతో ప్రేమ‌లో పడ్డట్టు ఫిల్మ్ న‌గ‌ర్‌లో పుకార్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వ‌రుణ్ సందేశ్ ఈ సుంద‌రితో 'అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్' అనే సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ స‌మయంలోనే వీరి మ‌ద్య ప్రేమ చిగురించింద‌ట‌. అందుకే ఈ సినిమా పూర్తవ్వక ముందే 'ఈ వ‌ర్షం సాక్షిగా' అనే మ‌రో చిత్రానికి ఒప్పుకున్నారట.

నిజానికి ఒక సినిమా రిలీజై అది సూప‌ర్ హిట్ అయితేనే హిట్ పెయిర్ అంటూ మ‌రో సినిమాకు బుక్ చేస్తారు. కానీ ఇక్కడ సినిమానే పూర్తవ్వలేదు. దీంతో వ‌రుణే ఈ సినిమాకు హ‌రిప్రియ‌ను పెట్టాలని కోరాడట. దీంతో వీరి మ‌ద్య స‌మ్ ధింగ్ స‌మ్ ధింగ్ న‌డుస్తుంద‌ని ....అది కూడా పీక్ స్టేజిలో వుంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments