Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండురోజుల్లో పది కోట్లకు చేరువలో 'భాయ్‌'... ఆ సీన్లకు కత్తెర

Webdunia
సోమవారం, 28 అక్టోబరు 2013 (14:28 IST)
WD
కింగ్‌ నాగార్జున, రిచా గంగోపాధ్యాయ్ నటీనటులుగా వీరభద్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'భాయ్‌' రెండు రోజుల్లో 7 కోట్ల 80 లక్షల రూపాయలను వసూలు చేసింది. అన్నపూర్ణ స్టూడియోస్‌ ప్రైవేట్ లిమిటెడ్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అసోసియేషన్‌లో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

ఈ సందర్భంగా దర్శకుడు వీరభద్రమ్‌ మాట్లాడుతూ... శుక్రవారం, శనివారం శ్రీరాములు, దేవి, గోకుల్‌, సత్యం థియేటర్‌లలో ఆడియన్స్‌తో కలిసి ఈ సినిమా చూశాను. ఆడియన్స్‌ చాలా ఎంజాయ్‌ చేస్తున్నారు. అన్నిచోట్ల సూపర్‌హిట్‌ టాక్‌ వచ్చి, హయ్యెస్ట్‌ ఓపెనింగ్స్‌ రావడం చాలా ఆనందంగా వుంది. రెండు రోజుల్లో రాష్ట్రంలో 7 కోట్ల 80 లక్షల షేర్‌ వసూలు చేయగా, ఓవర్సీస్‌, చెన్నై, కర్ణాటక ఏరియాల్లో 2 కోట్ల 10 లక్షలు వసూలు చేసింది. దాదాపు ఈ రెండు రోజుల్లో పది కోట్లకు చేరువలో ఉంది. ఆదివారం కూడా హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో నడుస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్‌ వంటి పెద్ద బేనర్‌లో ఈ సినిమా చెయ్యడం అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు.

మా గురువుగారు చెప్పిన మాట నిజం...

నా గత రెండు చిత్రాల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌ పాళ్ళు ఎక్కువగా ఉన్నాయి. ఈ చిత్రంలో కూడా అలాగే ఉంటాయని చాలామంది ఎక్స్‌పెక్ట్‌ చేశారు. 90 సినిమాలకు పైగా సినిమాల్లో నటించిన నాగార్జున గారిని న్యూ లుక్‌లో చూపించాలనుకున్నాను. ఆయన బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు సినిమాని మలిచాను. ఫ్యామిలీ ఆడియన్స్‌కి, మహిళలకి సినిమా బాగా కనెక్ట్‌ అయింది.
ఎమ్మెస్‌, బ్రహ్మానందం కామెడీ సీన్లకు, పాటలకు, పంచ్‌ డైలాగ్‌లకు మంచి స్పందన వస్తోంది. రెండున్నర గంటలపాటు ఆడియన్స్‌ని థియేటర్‌లో కూర్చోబెట్టగలిగిన సినిమా నిజమైన సక్సెస్‌ సాధింనట్లు అని మా గురువు ఇ.వి.వి.సత్యనారాయణగారు చెప్పిన మాట వంద శాతం నిజం అని మా సినిమా ప్రూవ్‌ చేసింది.

కొన్ని సీన్స్‌ కట్‌ చేశాం...

ఇద్దరు కామెడీ హీరోలతో సినిమాలు చేసిన నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం మీడియానే. మీడియాను తక్కువచేసి నేనేప్పుడు మాట్లాడను. ఈ సినిమాలో మీడియాని కించపరిచేలా ఉన్న సీన్లను తొలగించాం అని తెలిపారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments