Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 100 కోట్ల సంక్రాంతి బిజినెస్: మహేష్ బాబు '1' x రామ్ చరణ్ 'ఎవడు'

Webdunia
బుధవారం, 8 జనవరి 2014 (13:05 IST)
WD
ఈ సంక్రాంతి రేసులో ఇద్దరు పెద్ద హీరోలు బరిలోకి దిగుతున్నారు. సూపర్‌స్టార్ మహేష్ బాబు, మెగా‌పవర్‌స్టార్ రామ్ చరణ్‌లు సంక్రాంతికి దుమ్మురేపడానికి సిద్ధమయ్యారు. హాలీవుడ్ రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన '1' సినిమాపై భారీగానే అంచనాలున్నాయి. రామ్ చరణ్ నటించిన 'ఎవడు'పై కూడా మంచి క్రేజ్ ఉంది.

సుకుమార్ దర్శకత్వం వహించిన '1' ఈ సినిమాను అత్యధిక థియేటర్లలో భారీగా జనవరి 10న రిలీజ్ చేయనున్నారు. ఇది విడుదలైన మరో రెండు రోజులకే రామ్ చరణ్ 'ఎవడు' వస్తాడు. ఆముందు రెండు రోజుల్లోనే చాలావరకు కలెక్షన్స్ రాబట్టడానికి '1' నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఏ విధంగా చూసినా డిస్ట్రిబ్యూటర్ షేర్ 60 కోట్లు వస్తేనే పెట్టిన పెట్టుబడి తిరిగివస్తుందట.

ఎందుకంటే, ఈ సినిమాకు అంతటి భారీస్థాయిలో బడ్జెట్టు పెరిగిపోయింది. అంతమొత్తం కలెక్ట్ చేయగలిగిందీ అంటే మాత్రం సినిమాలో దమ్మున్నట్టే!. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహేష్ తమ సినిమా 100 కోట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. హాలీవుడ్ రేంజ్‌లో 'వన్' మ్యాన్ షోతో వచ్చే '1' సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

మరి రామ్ చరణ్ విషయానికి వస్తే వైవిధ్యభరితమైన కథాంశంతో 'ఎవడు' అంటూ వస్తున్నాడు. రామ్ చరణ్‌కు జోడిగా ఇందులో శృతిహాసన్ నటించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్, కాజల్ గెస్ట్ రోల్‌లో కనిపించడం అదనపు బలం. అందుకేనేమో మహేష్ 'ఒక్కడే' ఇద్దరితో పోటీ పడతాడా అంటూ టాలీవుడ్‌లో కామెడీగా జోకులు వేసుకుంటున్నారు.

ఇటీవల విడుదల చేసిన 'ఎవడు' థియేటరికల్ ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ఇందులో చరణ్ ఆకలిగొన్న పులిలా కనిపిస్తున్నాడు. రామ్ చరణ్‌కు మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండటంతో దిల్ రాజు మాస్ సెంటర్ల థియేటర్లపై టార్గెట్ చేశాడు. ముందుగా వచ్చిన మహేష్ మల్టీప్లెక్స్‌లలో దున్నేయడంతో దిల్ రాజు 'ఎవడు'ను అత్యధిక థియేటర్లులో రిలీజ్ చేసి కలెక్షన్స్ రాబట్టుకోవాలని చూస్తున్నాడు.

గత సంవత్సరం సంక్రాంతికి వచ్చిన నాయక్, 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' రెండూ విజయం సాధించాయి. ఈసారీ కూడా '1', 'ఎవడు' విజయాలు సాధిస్తాయని అంటున్నారు. దూకుడు, బిజినెస్‌మెన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో హ్యాట్రిక్ విజయాలతో ఉన్న మహేష్ '1'తో తన ఫామ్‌ను కొనసాగిస్తాడా, అజయాలతో తంటాలు పడుతున్న చెర్రీ 'ఎవడు'తో విజయం సాధిస్తాడా అని తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments