Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్‌ చరణ్‌, శ్రీను వైట్ల భారీ చిత్రం... ఆగష్టులో షూటింగ్!

Webdunia
గురువారం, 10 ఏప్రియల్ 2014 (09:14 IST)
FILE
ప్రస్తుతం 'గోవిందుడు అందరి వాడేలే' సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ తదుపరి సినిమా ఖరారైంది. ఎంటర్ టైన్మెంటుకి అధిక ప్రాధాన్యత ఇచ్చే శ్రీను వైట్ల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. చరణ్ నటించిన 'నాయక్‌' చిత్రాన్ని అందించిన యూనివర్సల్‌ మీడియా అధినేత డివివి దానయ్య దీనికి నిర్మాత. ఈ సినిమా షూటింగ్‌ ఆగస్టులో ప్రారంభం కాబోతుంది. ప్రముఖ తారాగణంతో పాటు అత్యుత్తమ సాంకేతిక నిపుణులు పనిచేయబోతున్నారు.

ఈ చిత్రం కోసం దర్శకుడు శ్రీను వైట్ల అద్భుతమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడు. నాయక్‌, ఎవడు తర్వాత రామ్‌ చరణ్‌ ఈ చిత్రంతో బ్లాక్‌బస్టర్‌పై కన్నేశాడు. వీరిద్దరి చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాల్ని దృష్టిలో పెట్టుకునే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు నిర్మాత. దూకుడు చిత్రం టాప్ లేపేసే యాక్షన్ అండ్ కామెడీ సన్నివేశాలు ఇందులో ఉంటాయని అంటున్నారు.

మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన నిర్మాత పవన్‌ కళ్యాణ్‌తో 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు', అల్లు అర్జున్‌తో దేశముదురు, జులాయి వంటి చిత్రాలు నిర్మించాడు. ప్రస్తుతం కృష్ణవంశీ రూపొందిస్తున్న 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో రామ్‌ చరణ్‌ నటిస్తున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

Show comments