Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజ, పూరీ కాంబినేషన్‌లో 'దేవుడు చేసిన మనుషులు'

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2012 (12:32 IST)
WD
రవితేజ, డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్‌, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సూపర్‌హిట్‌ అయ్యాయి. ఈ సూపర్‌హిట్‌ కాంబినేషన్‌లో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై భారీ చిత్రాల నిర్మాత 'ఛత్రపతి' ప్రసాద్‌ 'దేవుడు చేసిన మనుషులు' అనే పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 17న షూటింగ్‌ ప్రారంభం అవుతుంది.

ఈ చిత్రం గురించి రవితేజ మాట్లాడుతూ - ''జగన్‌ కాంబినేషన్‌లో చేస్తున్న 5వ చిత్రం ఇది. మా కాంబినేషన్‌లో ఎక్స్‌పెక్ట్‌ చేసే అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఇందులో వుంటాయి. మా బి.వి.ఎస్‌. ఎన్‌.ప్రసాద్‌గారి బేనర్‌లో ఈ సినిమా చెయ్యడం హ్యాపీ'' అన్నారు.

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ - ''రవితేజతో చేస్తున్న మంచి కమర్షియల్‌ ఫిలిమ్‌ ఇది. రవి క్యారెక్టరైజేషన్‌ చాలా డిఫరెంట్‌గా వుంటుంది. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో అందరినీ అలరించే సినిమా అవుతుంది'' అన్నారు. భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ - ''రవితేజ, పూరి జగన్నాథ్‌ల సూపర్‌హిట్‌ కాంబినేషన్‌లో మా బేనర్‌లో 'దేవుడు చేసిన మనుషులు' సినిమా చెయ్యడం చాలా ఆనందంగా వుంది.

వరసగా హిట్స్‌ ఇస్తున్న రవితేజ, తాజాగా 'బిజినెస్‌మేన్‌'తో రికార్డులు సృష్టించిన పూరి జగన్నాథ్‌.. ఇద్దరూ కలిసి 'దేవుడు చేసిన మనుషులు'ని పెద్ద రేంజ్‌ సినిమాగా రూపొందించబోతున్నారు. హండ్రెడ్‌ పర్సెంట్‌ పక్కా కమర్షియల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఇంతకుముందు వచ్చిన 'దేవుడు చేసిన మనుషులు' కథకు, ఈ సినిమా కథకు ఏ విధమైన సంబంధం లేదు.

కమర్షియల్‌ సినిమాల్లో ఇది ఓ ట్రెండ్‌ సెట్టర్‌ అవుతుంది. రవితేజ సరసన ఇలియానా నటిస్తుంది. ఫిబ్రవరి 17న షూటింగ్‌ ప్రారంభం అయ్యే ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ మార్చి 1 నుంచి ఏకధాటిగా జరుగుతుంది. జూన్‌లో రిలీజ్‌ అవుతుంది'' అన్నారు.

ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, సంగీతం: రఘు కుంచె, ఫైట్స్‌: విజయ్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: చిన్నా, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, కో-డైరెక్టర్‌: విజయరామ్‌ప్రసాద్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కో-ప్రొడ్యూసర్‌: భోగవల్లి బాపినీడు, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వన్ నేషన్-వన్ ఎలక్షన్: దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా

కేటీఆర్‌ను కలవలేదు.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదు.. దువ్వాడ మాధురి (video)

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Show comments