Webdunia - Bharat's app for daily news and videos

Install App

"యంగ్ ఇండియా"కి స్క్రిప్ట్ నేనే రాసుకున్నా..!: దాసరి

Webdunia
WD
చాలాకాలం తర్వాత అంటే.. "స్వర్గం-నరకం" తర్వాత మళ్ళీ తాను తీసే చిత్రకథకు తానే స్క్రిప్ట్ రాసుకున్నానని దర్శకరత్న దాసరి నారాయణ రావు అన్నారు.

అప్పుడు అసిస్టెంట్ డైరక్టర్లు ఉండేవారు. తాను చెబితే రికార్డు చేసేవారు. కానీ ఈసారి మాత్రం తానే స్వయంగా స్క్రిప్ట్ రాసుకున్నానని ఆయన చెప్పారు.

" యంగ్ ఇండియా" పేరుతో దాసరి ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర విశేషాలను ఆయన తెలియజేస్తూ.. ఇందులో అందరూ కొత్తవారే నటిస్తారు. అందులో ఏ మాత్రం సందేహం లేదని చెప్పారు. ఇతరుల వలె చెప్పేదొకటి వేరొకటి చేయడం తన తత్త్వంకాదని దాసరి స్పష్టం చేశారు.

కొత్తవారిని తీసుకుంటున్నామని, నిర్మాత కొడుకునే, హీరో కొడుకునే తీసుకునే దౌర్భాగ్యం తనకు పట్టలేదని, ఇండస్ట్రీకి కొత్త ప్రతిభగల వారిని తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నానని దాసరి పేర్కొన్నారు.

నాలుగు హీరోలు, 4 హీరోయిన్లతో పాటు 60మంది క్యారెక్టర్ ఆర్టిస్టులను ఎంపికచేయబోతున్నామని, ఇటీవలే ఇచ్చిన ప్రకటనలకు అనూహ్య స్పందన వచ్చిందని దర్శకరత్న వెల్లడించారు. మొత్తం 15000 దరఖాస్తులు అందాయని, ఇంకా నాలుగు బస్తాల అప్లికేషన్లు ఉన్నాయని ఆయన తెలియజేశారు.

అయినా వాటినన్నింటిని ఓపిగ్గా చూడదలచుకున్నామని, కొంతమంది గడువు మరీ తక్కువగా ఉందంటున్నారు. అందుకే సెప్టెంబర్ 7వరకు గడువును పొడిగించామని గురువారం దాసరి మీడియాతో చెప్పారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments