Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మైసమ్మ'తో చిందులు వేసిన బ్రహ్మానందం

Webdunia
బుధవారం, 8 ఆగస్టు 2007 (14:37 IST)
WD PhotoWD
' లక్ష్మీపుత్రుడు' చిత్రం కోసం కమెడియన్ బ్రహ్మానందం, ఐటం గర్ల్ ముమైత్‌ఖాన్‌లపై హైదరాబాద్‌ శివార్లలోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ పాటను చిత్రీకరించారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ఇమిటేడ్ చేస్తూ.. వివిధ రకాల గెటప్స్‌లో ప్రేక్షకులను ఈ చిత్రంలో ఆలరించనున్నారు. 'శివాజీ' చిత్రంలో 'వాజీ వాజీ నా శివాజీ' పాటకు పేరడీ పాటను బ్రహ్మానందం, ముమైత్‌లపై చిత్రీకరించారు.

ఆర్.ఎస్.ఫిలింస్ పతాకంపై పోలిశెట్టి రాంబాబు నిర్మిస్తున్న ఈచిత్రానికి రాజ్‌కపూర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా 'శివాజీ' గెటప్‌పై బ్రహ్మానందం మాట్లాడుతూ.. రజనీ స్టైల్‌ను ఎవరూ ఇమిటేట్ చేయలేరని, అయినప్పటికీ తాము ఓ చిన్న ప్రయత్నంగా చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలో మిమిక్రీ పాట ఖచ్చితంగా ప్రేక్షకులను ఆలరిస్తుందని నిర్మాత రాంబాబు ధీమా వ్యక్తం చేశారు.

ఈ చిత్రంలో ఉదయకిరణ్ దియా హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా.. తమిళ విలక్షణ నటుడు సత్యరాజ్ ఓ ప్రత్యేక పాత్రలో పోషిస్తున్నారు. డి.ఇమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాజన్ పి.దేవ్, సెక్సీ బాండ్ షకీలా, రఘుబాబు తదితరులు నటిస్తున్నారు.

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి