Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ ప్రెసిడెంట్ నేనే... పోలీసు దెబ్బకు తోక ముడిచి...

Webdunia
మంగళవారం, 10 డిశెంబరు 2013 (18:24 IST)
WD
ఆల్‌ ఇండియా మహేష్‌, కృష్ణ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిని అంటూ ప్రచారం చేసుకుంటున్న ఖాదర్‌వలి కొంతమందిని వెంటేసుకుని, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌పై రూపొందుతున్న '1' చిత్రం ఆఫీసుకు వెళ్ళి లొల్లి చేశారు. జూబ్లీహిల్స్‌లోని సంస్థ కార్యాలయంకు వెళ్ళి అక్కడ నిర్మాతను నిలదీస్తున్నామని మీడియాకు ఫోన్లు చేసి రమ్మన్నారు.

కానీ ఆయనతోపాటు ఫ్యాన్స్‌ అని చెప్పుకుంటున్న పదిమంది కూడా రాలేదు. వివరాల్లోకి వెళితే ఖాదర్‌వలి కృష్ణ ఫ్యాన్స్‌ అధ్యక్షుడిగా ఆయన పుట్టినరోజునాడు ఇంటి దగ్గర హడావుడి చేస్తుంటాడు. అదేక్రమంలో మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ అధ్యక్షుడిని కూడా తానేనని ప్రచారం చేసుకున్నాడు. మీడియా కూడా ఆయన ఫొటోలతో పేరును కూడా చేర్చేది.

అసలు విషయం ఏమంటే సోమవారం రాత్రి హైటెక్స్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో మహేష్‌బాబు సిక్స్‌ప్యాక్‌కు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరణ జరుగుతోంది. అక్కడకు రాత్రి 10 గంటల తర్వాత ఖాదర్‌వలి వెళ్ళాడు. కానీ లోపలికి చిత్ర నిర్మాత అనిల్‌ సుంకర అనుమతించలేదు. దాంతో చిన్నపాటి గొడవ జరిగింది. రేపు ఆఫీసుకు వచ్చి మాట్లాడుదాం రండి అని నిర్మాత పిలిచాడు. ఆ పనిలో భాగంగా మంగళవారం నాడు అతను ఆఫీసుకు వెళ్ళాడు. కానీ నిర్మాత లేడు.

ఈలోగా విషయం తెలిసి పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. మీడియా కూడా వచ్చి వివరాలు అడిగింది. అసలు మీరు ఫ్యాన్స్‌ అధ్యక్షుడిగా మహేష్‌ ఇచ్చిన ప్రూఫ్‌ ఉందా? అని అడిగితే.. సరైన సమాధానం చెప్పలేదు. తనే ప్రింట్‌ చేసుకున్న ఐడెంటిటీ కార్డ్‌ చూపించాడు. దీంతో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సరైన సమాధానలు చెప్పలేదు. చివరకు తెల్లమొహం వేయడంతో పోలీసులు మందలించారు. దీంతో అతడు వెనుతిరిగాడు. అందుకే... హీరోలు తమ ఫ్యాన్స్‌ నాయకుడు ఎవరో ప్రకటిస్తే ఈ గొడవ ఉండదంటున్నాయి సినీవర్గాలు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments