Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మర్యాద రామన్న" తెలంగాణా టూర్

Webdunia
WD
రాజమౌళి దర్శకత్వంలో సునీల్ హీరోగా నటించిన మర్యాద రామన్న చిత్ర తెలంగాణా విజయయాత్రకు యూనిట్ ఈ నెల 6వ తేదీ నుంచి వెళ్లనుంది. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజమౌళి మాట్లాడుతూ... ఆరవ తేదీన హైదరాబాదు నుంచి బయలుదేరి నిజామాబాద్, మెట్‌పల్లి, జగిత్యాల, కరీంనగర్, హుజురాబాద్, హనుమకొండ, వరంగల్ వెళుతున్నాం.

7 వ తేదీన వరంగల్‌లోని మిగిలిన ప్రాంతాలు, ఖమ్మం, సూర్యాపేట మీదుగా తిరిగి హైదరాబాద్ తిరిగి వస్తాం అన్నారు. ఇటీవలే నాలుగు రోజులు ఆంధ్ర టూర్ వేశాం. అక్కడ అనూహ్యమైన స్పందన వచ్చింది. కొన్ని ఏరియాల్లో ధియేటర్లకు వెళ్లే అవకాశం లేక వెళ్లలేకపోయాం. ఆర్టిస్టులందరికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులు మా చిత్రాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నారు.

మహేష్ బాబుతో సినిమా
త్వరలో తాను ప్రభాస్‌తో సినిమా చేస్తున్నానని రాజమౌళి చెప్పారు. ఆర్కే మీడియా పతాకంపైనే ఈ చిత్రం ఉంటుందన్నారు. ఇప్పటికే ప్రభాస్ చాలా బిజీగా ఉండటం వల్ల షూటింగ్ ఆలస్యమైంది. ఆ తర్వాత మహేశ్ బాబుతో ఓ చిత్రం ఉంటుందని అన్నారు.

మర్యాద రామన్న చిత్రాన్ని కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతోపాటు వారి చేతుల్లోనుంచి కొనుగోలు చేసిన థర్డ్ పార్టీలు కూడా హ్యాపీగానే ఉన్నారన్నారు. అందరికీ మంచి ప్రాజెక్ట్ ఇదని సంతోషం వ్యక్తం చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

Show comments