Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచు మనోజ్: థ్యాంక్యూ గాడ్.. అభిమానుల ప్రేమ, ఆశీస్సుల వల్లే!

Webdunia
మంగళవారం, 10 డిశెంబరు 2013 (13:24 IST)
FILE
హైదరాబాద్‌లోని ఆదివారం ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన దారుణమైన కారు ప్రమాదం నుంచి సినీనటుడు మంచు మనోజ్ క్షేమంగా బయటపడిన సంగతి తెలిసిందే. అంతటి తీవ్రమైన ప్రమాదం జరిగినా స్వల్పగాయాలతోనే ఆయన బయటపడడం పెద్ద విశేషం. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును మనోజ్ తాజాగా ట్విట్టెర్ ద్వారా వెల్లడించాడు.

" ఆ రోజు ఫ్రెండ్ వివాహనికి నా కారులో వెళుతున్నాను. అంతకుముందే అమ్మ నా కారులోంచి మరో కారులోకి మారింది. నా ముందు వెళుతున్న బస్సు హఠాత్తుగా ఎడమవైపుకి తిరిగింది. దాంతో, దాని నుంచి తప్పించుకోవడానికి నేను కుడి వైపుకి కట్ చేశాను. అప్పటికే అక్కడ చనిపోయిన గేదె పడివుంది.

వీధిలైట్లు లేకపోవడంతో నాకది కనిపించలేదు. నాకారెళ్ళి దానిని ఢీకొట్టి, గాల్లోకి లేచి, పల్టీలు కొట్టింది. స్టంట్స్ తెలిసిన వాడిని కాబట్టి, వెంటనే అలర్ట్ అయ్యాను. ఎవరికీ దెబ్బలు తగలలేదు... థ్యాంక్ గాడ్!" అన్నాడు మనోజ్. విశేషం ఏమిటంటే, మనోజ్ కారు ప్రమాదానికి గురికావడానికి ముందు ఆ గేదె కారణంగా మరో రెండు ప్రమాదాలు కూడా జరిగాయట! ఏమైనా, అభిమానుల ప్రేమ, ఆశీస్సుల వల్లే అంతటి ప్రమాదం జరిగినా బ్రతికి బట్టకట్టానని మనోజ్ అంటున్నాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments