Webdunia - Bharat's app for daily news and videos

Install App

''బ్రహ్మానందం డ్రామా కంపెనీ'' పాటలు వచ్చేశాయ్

Webdunia
WD PhotoWD
హిందీ ''భాగంభాగ్'' చిత్నాన్ని తెలుగులో ''బ్రహ్మానందం డ్రామా కంపెనీ'' (హీరోయిన్ జంప్)గా రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం పాటలు గురువారం మార్కెట్లో ఆదిత్య మ్యూజిక్ సంస్థ విడుదల చేసింది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథి డాక్టర్ డి.రామానాయుడు ఆడియోను విడుదల చేసి చిత్ర హీరోయిన్ కమలినీ ముఖర్జీకి అందజేశారు. అనంతరం తమ్మారెడ్డి భరద్వాజ సీడీని ఆవిష్కరించి నందమూరి తారక్‌కు అందించారు.

ఈ సందర్భంగా నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ, గతంలో ఈ చిత్రం దర్శకుడు శ్రీకాంత్, నిర్మాత పల్లి కేశవరావు నిర్మించిన 'శ్రీరామచంద్రులు' చిత్రంలో మంచి పాత్ర పోషించాను. ఆ చిత్రం హిట్ కావడంతో శ్రీరామచంద్రులు బేనర్‌గా పెట్టి 'బ్రహ్మానందం డ్రామా కంపెనీ' హీరోయిన్ జంప్ అంటూ సినిమా తీశారు.

టైటిల్ అంతా నా పేరు పెట్టారుకాబట్టి తప్పకుండా విజయం కావాలని కోరుకుంటాను. ఈ చిత్రం ఎండాకాలంలో నవ్వులు కురిపిస్తుంది అని చెప్పగలను. సాయికార్తీక్ చక్కటి మ్యూజిక్ ఇచ్చాడు' అన్నారు.

నటుడు శివాజీ మాట్లాడుతూ, ఒకప్పుడు పల్లికేశవరావు దగ్గర పనిచేద్దామనుకున్నాను. ఈనాడు ఆయన నిర్మించే చిత్రంలో హీరోగా చేయడం ఆనందంగా ఉంది. భాగంభాగ్ చిత్రంలోని తప్పుల్ని సరిచేస్తూ ఈ చిత్రాన్ని దర్శకుడు చక్కగా తెరకెక్కిస్తున్నారు అని చెప్పారు. ఈ చిత్రంలో తానూ ఓ భాగమైనందుకు ఆనందంగా ఉందని నటుడు రవికృష్ణ అన్నారు.

చిత్రంమంతా తన పాత్రచుట్టూ నడుస్తుందని కమలినీ ముఖర్జీ చెప్పారు. ఈ చిత్రాన్ని మార్చి నెలాఖరులో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత చెప్పారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - చెవి కమ్మలు నొక్కేసిన ఆస్పత్రి వార్డు బాయ్ (Video)

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

Show comments