Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకాక్‌లో "నమో వెంకటేశ" ఆడియో ఆవిష్కరణ

Webdunia
WD
విక్టరీ వెంకటేష్, హ్యాట్రిక్ డైరక్టర్ శ్రీనువైట్ల తొలి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "నమో వెంకటేశ". సురేష్ ప్రొడక్షన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ జనవరి ఐదో తేదీన బ్యాంకాక్‌లో వైభవంగా జరిగింది. విక్టరీ వెంకటేష్ ఆడియోను ఆవిష్కరించి తొలి సీడీని హీరోయిన్ త్రిషకు అందించారు.

ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. "బ్యాంకాక్‌లో ఆడియో రిలీజ్ చెయ్యడం చాలా సంతోషంగా ఉంది. దేవీశ్రీప్రసాద్ చాలా అద్భుతంగా సంగీతం అందించారు. రామజోగయ్యశాస్త్రి అద్భుతమైన పాటలు రాశారు. పాడుకోవడానికి వీలుగా వుంటే మంచి పాటలివి. నమో నమో వెంకటేశ.., సౌందర్యా సౌందర్యా.., డింగ్ డాంగ్.. అని సాగే పాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఇప్పటివరకు ఐస్‌లాండ్‌లో ఎవరూ చెయ్యని లొకేషన్‌లో పాటల చిత్రీకరణ చేశాం. అలాగే ఆస్ట్రియా, యూరప్, ఇప్పుడు బ్యాంకాక్‌లో ఓ సాంగ్ చేస్తున్నాం. శ్రీనువైట్ల ఎంటర్‌టైన్‌మెంట్ అంటే నాకు చాలా ఇష్టం. అద్భుతమైన సబ్జెక్టుతో వస్తోన్న ఈ సినిమా కుటుంబసమేతంగా చూసి ఆనందించేలా ఉంటుంది. అలాగే నిర్మాతలు ఓ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఫిల్మ్ ఇవ్వాలనే ఉద్దేశంతో తీస్తున్న ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఇంకా నా ఇష్టదైవం వెంకటేశ్వరస్వామి. ఆయన ఆశీస్సులతో నమో వెంకటేశ హిట్ అవుతుంది" అని వెంకీ ఆశించారు.

దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ.. నా కెరీర్‌లో మర్చిపోలేని సినిమా "నమో వెంకటేశ". సురేష్ ప్రొడక్షన్స్ వంటి పెద్ద సంస్థతో కలిసి నా స్నేహితులు రాము, గోపి, అనిల్ నిర్మిస్తున్న "నమో వెంకటేశ" చాలా బాగా వచ్చింది. ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాతలు.. తొలి సినిమా ద్వారానే సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌లుగా నిలబడతారు. నాకెంతో ఇష్టమైన వెంకటేష్‌తో సెంటిమెంట్, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి అన్ని అంశాలు మేళవించి రూపొందించిన "నమో వెంకటేశ"లో వెంకీ కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. త్రిష క్యారెక్టర్ ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. అలాగే బ్రహ్మానందం ఇంతకుముందు చేయని తరహాలో అద్భుతమైన పాత్రను పోషించారు. కెమెరామెన్ ప్రసాద్ మూరెళ్ల పనితీరు, దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్‌తో పాటు యూనిట్ తీవ్రంగా శ్రమించి అద్భుతంగా మలచిన "నమో వెంకటేశ" తప్పకుండా సంక్రాంతికి విందు భోజనం లాంటి సినిమా అవుతుంది" అని చెప్పారు.

హీరోయిన్ త్రిష మాట్లాడుతూ.. "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే"లో నేను చేసిన క్యారెక్టర్‌కి పూర్తి కాంట్రాస్ట్ క్యారెక్టర్ ఇది. నేను ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేశాను. వెంకటేశ్‌తో నాకిది మరో సూపర్ హిచ్ సినిమా అవుతుంది" అని అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. "ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ ఆడియో సీడీలు, క్యాసెట్లు జనవరి ఆరు నుంచి మార్కెట్‌లో లభ్యమవుతాయి. సంక్రాంతి కానుకగా జనవరి 14న భారీ ఎత్తున సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అని చెప్పారు.

బ్యాంకాక్‌లో జరిగిన ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కి భార్గవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో అక్కడి వెంకటేష్ అభిమానులు కూడా పాల్గొన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments