Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్‌కు మద్దతుగా టాలీవుడ్

Webdunia
బాలీవుడ్ నిర్మాతలకు మద్దతుగా టాలీవుడ్ నిర్మాతలు అండగా నిలిచారు. ముంబైలో కొన్ని రోజులుగా మల్టీఫ్లెక్స్ థియేటర్ల యాజమాన్యానికి, చిత్ర నిర్మాతలకు పర్సెంటేజీ విధానంలో తేడాలున్నాయి. మొదట అనుకున్న విధంగానే 50-50 నిష్పత్తిలో కాకుండా వచ్చిన కలెక్షన్లను 60శాతం, 80శాతం.. ఇలా ఎవరిష్టం వచ్చినట్లు వారు తీసుకుని మిగిలినవి నిర్మాతలకు ఇస్తున్నట్లు ఫిర్యాదు చేస్తున్నారు.

దీనికి మల్టీఫ్లెక్స్ యాజమాన్యం దిగిరాకపోవడంతో అక్కడ నిర్మాతలందరూ నాన్ కోపరేషన్ అంటూ కార్యరంగంలో దిగారు. ప్రస్తుతం అక్కడ మల్టీఫ్లెక్స్ థియేటర్లలో చిత్ర నిర్మాతలెవ్వరూ తమ సినిమాలను ప్రదర్శించడం లేదు. వీరికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ తెలుగుచలనచిత్ర నిర్మాతల మండలి సంఘీభావం తెలిపింది.

ఈ విషయాన్ని గురువారం ఫిలిమ్ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాతలమండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ, కార్యదర్శి టి.వి.డి. ప్రసాద్ తెలియజేశారు. ఆంధ్రరాష్ట్రంలో ఇంకా అటువంటి పద్ధతి రాలేదని, ఒకవేళ మనవద్ద నిర్మాతలకు, మల్టీఫ్లెక్స్ యాజమాన్యానికి ఏవైనా తేడాలుంటే, అప్పుడు ఏమి చేయాలో నిర్ణయిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments