Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంక చోప్రా సంచలనం: కామసూత్రను నిషేధించండి!

Webdunia
శనివారం, 7 డిశెంబరు 2013 (16:49 IST)
FILE
దేశంలో నానాటికీ అత్యాచారాలు, మహిళలపై వేధింపులు పెరిగిపోవడానికి సినిమాలే కారణమని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. సినిమాల్లో నటీమణులు హద్దులుమించి అంగాంగ ప్రదర్శన చేస్తున్నారని కొందరు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా స్పందించింది. సినిమాల వల్లే అత్యాచారాలు పెరుగుతున్నాయనడాన్ని ఆమె తప్పుబట్టింది.

ఈ విషయంపై ప్రియాంక తాజాగా సంచలన కామెంట్స్ చేసింది. దేశంలో మహిళలపై అత్యాచారాలు జరగడం వెనుక సినిమాల ప్రభావముందని వస్తున్న ఆరోపణలను ఆమె తోసిపుచ్చింది. ఇందుకు సినిమాలే కారణమైతే ముందుగా కామసూత్రను నిషేధించాలంటూ సంచలనాత్మకమైన కామెంట్ చేసింది.

ప్రియాంక‌చోప్రా హీరోయిన్‌గా నటిస్తూనే... వీలైతే ఐటెమ్‌సాంగ్స్ కూడా చేస్తోంది. కాస్త ఎక్స్‌పోజింగ్ పెంచడంతో ఈమెపై ఆరోపణలు తీవ్రమయ్యాయి. దీనిపై ఆమె తొలిసారిగా క్లారిటీ ఇచ్చింది. కళలను కళలుగానే చూడాలే తప్ప.. వాటిని మరొక దానితో లింక్ పెట్టడం భావ్యం కాదంటోంది. కామసూత్రాలకు నెలవైన మనదేశంలో అన్నిరకాల కళలకు కొదవలేదని తేల్చేసింది. శిల్పాలు చెక్కడం, అందమైన పద్యాలు, సినిమా వంటి కళ గురించి ఈ సందర్భంగా ప్రస్తావించింది.

అయితే సినిమాలకు సెన్సార్‌బోర్డు వున్న విషయాన్ని గుర్తు చేసింది. ముందు వాత్సాయనుడి కామసూత్ర పుస్తకాలను బ్యాన్ చేయాలని తర్వాత చారిత్రక ప్రాధాన్యమున్న అజంతా ఎల్లోరా గుహలను నిషేధించాల్సిందేనంటూ స్పష్టంచేసింది. అంతేకాదు... 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చిన సినిమాలకు పిల్లలను ఎందుకు పంపిస్తున్నారని ప్రియాంక మండిపడింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments