Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాటలు మినహా 'నాకూ ఓ లవరుంది' షూటింగ్‌ పూర్తి

Webdunia
వినాయకుడు, విలేజ్‌లో వినాయకుడు వంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన కృష్ణుడు హీరోగా మరో విభిన్న కథా చిత్రం రూపొందనుంది. మాస్టర్‌ హేమచంద్రారెడ్డి, బేబి హేమశ్రీ సమర్పణలో శ్రీశివపార్వతి కంబైన్స్‌ బేనర్‌పై ప్రొడక్షన్‌ నెం.1గా రూపొందుతున్న 'నాకూ ఓ లవరుంది' పాటలు మినహా టాకీపార్ట్‌ పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా నిర్మాత కె.సురేష్‌బాబు మాట్లాడుతూ - ''యూనిట్‌లోని అందరి కోఆపరేషన్‌తో ఈ చిత్రం టాకీపార్ట్‌ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సారథీ స్టూడియోలో వేసిన సెట్‌లో ఐటమ్‌ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నాం. బాంబే మోడల్‌ రేష్మి, హీరో కృష్ణుడుతోపాటు హీరో ఫ్రెండ్స్‌ బ్యాచ్‌, డాన్సర్స్‌పై ఈ పాటను తీస్తున్నాం. ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్‌ రాధాకృష్ణన్‌ మ్యూజిక్‌. ఇందులో ఐదు పాటలు వున్నాయి. అన్ని పాటలు సూపర్‌హిట్‌ అయ్యేలా ఆయన ట్యూన్‌ చేశారు.

ఈ నెలాఖరులో ఆడియో రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేశాం. ఈనెల 11 నుంచి బ్యాంకాక్‌లో బ్యాలెన్స్‌ పాటల చిత్రీకరణ జరుగుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్‌లో చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యాలనుకుంటున్నాం'' అన్నారు.

దర్శకుడు కె.రామ్‌వెంకీ మాట్లాడుతూ - ''మేం అనుకున్న దానికంటే సినిమా బాగా వస్తోంది. నేను ఫస్ట్‌టైమ్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమాకి మంచి నిర్మాత దొరికారు. బడ్జెట్‌ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమా బాగా రావడానికి సహకరిస్తున్నారు. కృష్ణుడు సినిమా అంటేనే ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. దానికి తగ్గట్టుగానే స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ అందరూ నవ్వుకునేలా ఈ సినిమా వుంటుంది'' అన్నారు.

కృష్ణుడు, రితిక, ఎం.ఎస్‌.నారాయణ, సురేష్‌, ఆలీ, హేమ, ఉషశ్రీ, గీతాసింగ్‌, మాస్టర్‌ భరత్‌, మున్నా వేణు, శివన్నారాయణ, అనంత్‌, ధనరాజ్‌, ఖడ్గం పృథ్వీ, పొట్టి రాంబాబు, తాగుబోతు రమేష్‌, గుండు హనుమంతరావు, రఘు కారుమంచి నటిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: రాఘవ టి., పాటలు: లక్ష్మీభూపాల్‌, పెద్దాడమూర్తి, సంగీతం: కె.ఎం.రాధాకృష్ణన్‌, ఎడిటింగ్‌: ఎం.ఆర్‌.వర్మ, ఆర్ట్‌: కృష్ణమాయ, కెమెరా: ఎస్‌.డి.జాన్‌, సమర్పణ: మాస్టర్‌ హేమచంద్రారెడ్డి, బేబి హేమశ్రీ, నిర్మాత: కె.సురేష్‌బాబు, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కె.రామ్‌వెంకి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments