Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌కళ్యాణ్‌తో పూరీజగన్నాథ్ కొత్త చిత్రం!

Webdunia
WD
" బద్రి" వంటి సూపర్ హిట్ తర్వాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, డాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్‌ల పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం రాబోతుంది. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నటుడు గణేష్ ఈ ప్రెస్టీజియస్ మూవీని నిర్మించడం విశేషం.

ఈ చిత్రం గురించి దర్శకులు పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ... "బద్రి" సినిమా తర్వాత మళ్ళీ కళ్యాణ్‌తో సినిమా చెయ్యడం చాలా హ్యాపీగా ఉందన్నారు. మధ్యలో చాలాసార్లు అనుకున్నామని, కొన్ని కథలు కూడా చెప్పడం జరిగిందని వెల్లడించారు.

కానీ ఏ కారణంతోనో తమ కాంబినేషన్‌లో మళ్లీ సినిమా చేయడం కుదరలేదన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తాను కలిసి వచ్చే సంవత్సరం ఓ సినిమా చెయ్యాలని నిర్ణయం తీసుకున్నామని, ఈ చిత్రానికి నటుడు గణేష్ నిర్మాత సారథ్యం వహిస్తున్నారని తెలిపారు.
WD

చాలాకాలంగా కళ్యాణ్‌తో సినిమా ఎప్పుడు అని అడుగుతున్న అభిమానులందరికీ ఇది ఓ గుడ్‌న్యూస్ అని, తనకు లైఫ్ ఇచ్చిన కళ్యాణ్‌తో మళ్లీ వర్క్ చేయడం ఆనందంగా ఉందన్నారు. 18ఏళ్ళుగా తన ఫ్రెండ్ అయిన గణేష్ ఈ సినిమాతో పెద్ద ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకుంటాడని పూరీ చెప్పారు.

కళ్యాణ్‌తో కాంబినేషన్ అంటే భారీ అంచనాలుంటాయని, ఆ అంచనాలకనుగుణంగా ఈ సినిమా రీచ్ అవుతుందని పూరీ జగన్నాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కళ్యాణ్‌తో సినిమా చేస్తున్నానన్న ఎనర్టీయే తనతో పవర్‌ఫుల్ స్టోరీ, అద్భుతమైన సీన్స్‌ను రాయిస్తుందని చెప్పారు.

తన ఎనర్జీ, కళ్యాణ్ ఎనర్జీ కలిస్తే ఎలా ఉంటుందో, సినిమా అలా ఉంటుందని పూరీ వెల్లడించారు. వచ్చే సంవత్సరమే ఈ చిత్రం ప్రారంభమవుతుందని, మిగిలిన వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఆయన తెలిపారు. పరమేశ్వర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మాణమయ్యే ఈ చిత్రానికి సమర్పణ... రవికిరణ్ బాబు, నిర్మాత... గణేష్ బాబు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం.. పూరి జగన్నాథ్.

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

ట్యూషన్‌కు వెళ్లమని తల్లి ఒత్తిడి... భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

మాజీ సీఎం జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ

అరెస్టు కోసం అమితాసక్తిగా ఎదురు చూస్తున్నా? : పేర్ని నాని

Vallabhaneni Vamsi: తాడేపల్లిలో జగన్‌ను కలిసిన వల్లభనేని వంశీ దంపతులు (video)

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

Show comments