Webdunia - Bharat's app for daily news and videos

Install App

"దేవుడు చేసిన మనుషులు" ఆడియోలో పవన్‌ మేనియా

Webdunia
శనివారం, 23 జూన్ 2012 (13:19 IST)
WD
సహజంగా పెద్ద హీరోల సినిమా ఆడియోలు శిల్పకళావేదికలో జరుగుతుంటాయి. దానికి హీరోలకు తగిన ఫ్యాన్స్‌ వస్తుంటారు. ఇక రాగానే పెద్దగా కేరింతలు, కేకలు, అరుపులు చేస్తుంటారు. ఏ హీరో ఫంక్షన్‌కు వస్తే ఆ హీరో గురించే మాట్లాడుతుంటారు. కానీ ప్రస్తుతం ట్రెండ్‌ మారినట్లుంది.

మొన్నీమధ్య అల్లు అర్జున్‌ 'జులాయి' ఆడియో వేడుకలో కూడా అల్లు అర్జున్‌ మాట్లాడుతుండగానే... పవన్‌ కళ్యాణ్‌ గురించే ఫ్యాన్స్‌ అడగడం... కేరింతలు కొట్టడం విశేషం. ఇప్పుడు అలానే మరోసారి రిపీట్‌ అయింది. రవితేజ తొలిసారిగా శిల్పకళావేదికలో దేవుడు చేసిన మనుషులు సినిమా ఆడియో వేడుక జరిపారు. రవితేజ అంటే.. సాధారణంగా పెద్ద క్రౌడ్‌ ఉండదు అనుకుని వస్తే.... ఆడిటోరియం బయట అంతా జనాలున్నాయి.

లోపల ఆడిటోరియం ఖాళీగా లేదని బయటే ఉండాల్సివచ్చింది. తీరా లోపలికి వస్తే... ఆడిటోరియంలో జనాలు ఫుల్‌గానే ఉన్నారు. కానీ చిన్న ట్విస్ట్‌.... పూరీ జగన్నాథ్‌ మాట్లాడినప్పుడు... ఒక్కసారిగా అరుపులు కేకలు వేశారు. వారు ఏం మాట్లాడుతున్నారో అర్థంకానంత కేకలు విన్పించాయి. కాసేపటికికానీ వారేం మాట్లాడారో అర్థం కాలేదు. 'కెమెరామెన్‌ రాంబాబు..' ఎప్పుడు.. అంటూ అరిచారు. రాంబాబూ షూటింగ్‌లో ఉన్నాడు. నేను వెంటనే వెళ్లిపోవాలంటూ... వారికి సమాధానమిచ్చారు పూరీ జగన్నాథ్.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments