Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రివిక్రమ్ స్టోరీ చెపుతుంటే నిద్రపోయా... 'అత్తారింటికి దారేది'లో పవన్ (ఫోటోలు)

Webdunia
శుక్రవారం, 19 జులై 2013 (22:54 IST)
త్రివిక్రమ్ శ్రీనివాస్ జానీ చిత్రం ఫ్లాపు సమయంలో తనకు ఓ స్టోరీ చెపుతుంటే నిద్రపోయానని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చెప్పారు. హైదరాబాదు శిల్పకళా వేదికలో ఘనంగా జరిగిన అత్తారింటికి దారేది ఆడియో ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ కాస్త లెంగ్తీగా మాట్లాడారు.
WD

జానీ చిత్రం ఫ్లాపుతో కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకు కథ చెప్పేందుకు వచ్చాడన్నారు. ఆ సమయంలో కథ చెపుతుంటే అదేంటో అలా నిద్రపోయానన్నారు. ఐనా త్రివిక్రమ్ ఎలాంటి ఫీలింగ్ లేకుండా మళ్లీ అదే చిరునవ్వుతో కథను చెప్పారన్నారు. అలాంటి వ్యక్తి తనకు వ్యక్తిగతంగానే కాకుండా ఎంతో వెన్నుదన్నుగా ఉండి జల్సా లాంటి హిట్ చిత్రాన్ని ఇచ్చాడని చెప్పుకొచ్చారు.
WD

తనకు సినిమాల్లో డైరెక్టర్లు చెప్పింది చేసి వెళ్లిపోతుంటాననీ, ప్రతిసారీ సెట్లోకి వచ్చినపుడల్లా భయపడుతుంటానని చెప్పుకొచ్చారు. అదేవిధంగా తనకు వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలున్నప్పటికీ అవన్నీ చెప్పలేననీ, ఐతే అభిమానుల కష్టనష్టాలన్నీ తనవి అనుకుంటానని అన్నారు.
WD

ఆడియో ఫంక్షన్లంటే తనకు అంతగా ఇష్టముండదనీ, ఎందుకంటే ఇక్కడకు కొద్దిమంది మాత్రమే రాగలుగుతారనీ, ఇంకా ఎంతోమంది చూడాలని అనుకుంటారనీ, వారందరికీ అవకాశం రాలేకపోయిందేనన్న బాధ తనను పట్టి పీడిస్తుందని, అందువల్ల అసలు ఆడియో ఫంక్షన్లకు రాకూడదని అనుకుంటానని చెప్పుకొచ్చారు.
WD

WD
పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సమంత హీరోయిన్‌గా తెరకెక్కిన అత్తారింటికి దారేది చిత్రం ఆడియో ఫంక్షన్ హైదరాబాదు శిల్పకళావేదిలో జరిగింది. ఈ చిత్రంలో వీడు 6 అడుగుల బుల్లెట్టు... పాటతోపాటు నిన్ను చూడగానే 2 కళ్లు తిట్టుకున్నవే... అనే పాట అభిమానులను ఉర్రూతలూగించాయి.

వెబ్దునియా పై చదవండి

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments