Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమన్నాకు ఝలక్ ఇచ్చిన సమంత... లక్కీ మస్కట్!

Webdunia
బుధవారం, 9 అక్టోబరు 2013 (11:12 IST)
FILE
క్రేజీ బ్యూటీ సమంత ఇప్పుడు టాలీవుడ్ నెంబర్‌వన్ హీరోయిన్ అయిపోయింది. వరుసగా హిట్ కొట్టి లక్కీ మస్కట్‌గా పేరుతెచ్చుకొంది. ప్రస్తుతం టాలీవుడ్‌ మొత్తం సమంత నామజపం చేస్తోంది. ఈ అమ్మడు తమ సినిమాలో నటిస్తే చాలు హిట్‌ కొట్టడం ఖాయమని దర్శకనిర్మాతలంతా సెంటిమెంట్‌ ఫీలవుతున్నారు.

అందుకే వరుసగా అగ్రహీరోల సినిమాలన్నింటిలో సమంత కథానాయకగా ఎంచుకుంటున్నారు. పవన్‌తో 'అత్తారింటికి దారేది' బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్నాక సమంత రేంజు అమాంతం పెరిగింది. మరో నాలుగేళ్లు ఈ అమ్మడి డైరీ ఫుల్‌. ఈ నెలలోనే ఎన్టీఆర్‌ 'రామయ్యా ...' సినిమాతో మరో హిట్‌కొట్టడానికి రెడీ అవుతోంది.

అలాగే ఎన్టీఆర్‌ సరసన నటిస్తూ 'రభస' చేస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం జోరుగా సాగు తోంది. అదేగాక అక్కినేని 'మనం'లోనూ ఓ నాయకగా నటిస్తోంది. అంతే కాకుండా సూర్యతో ఓ తమిళ సినిమాలోనూ సమంత కథానాయకగా నటిస్తోంది. ఆటోనగర్‌ సూర్యలోనూ సమంత కథానాయక. ఇవేగాక బెల్లకొండ సురేష్‌ తనయుడు శ్రీనివాస్ హీరోగా పరిచయం అవుతున్న సినిమాలోనూ అమ్మడే కథానాయక.

వాస్తవానికి ఈ సినిమాలో తమన్నాను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ అనూహ్యంగా సమంత ఆ స్థానాన్ని రీప్లేస్‌ చేసింది. లక్కీ మస్కట్‌ సమంత చూపిస్తున్న హవా చూస్తుంటే టాలీవుడ్‌లో నంబర్‌వన్‌ హీరోయిన్‌ అనడం అతిశయోక్తి కానేకాదు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments