Webdunia - Bharat's app for daily news and videos

Install App

జె.డి.చక్రవర్తి చేతులమీదుగా "యువరాజ్యం" ఆడియో

Webdunia
WD
వీరశంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న "యువరాజ్యం" ఆడియో విడుదల గురువారం రాత్రి శిల్పకళావేదికలో జరిగింది. ముఖ్యఅతిథి జె.డి. చక్రవర్తి ఆడియో సీడీని విడుదల చేసి సంగీత దర్శకుడు గురుచరణ్‌కు అందజేశారు.

యువకులకు సంబంధించిన కథ కాబట్టి పలు విద్యార్థి సంఘాల నాయకులను పిలిపించి ఆడియో వేడుకను జరిపారు. స్వాతంత్ర్య సమరయోధుడు నారాయణరావు పవాన్‌ను నాగబాబుచే సన్మానించారు.

ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. సంగీతం బాగుంది. ఆడియోతోపాటు సినిమాకూడా హిట్ కావాలని కోరుకుంటున్నానన్నారు.

జె.డి. చక్రవర్తి మాట్లాడుతూ.. ఇంతమంది సంగీత దర్శకులు ఒక సినిమాకు పనిచేయడం చాలా గొప్పవిషయం. వీరశంకర్ మంచి ప్రతిభాశాలి కావడంతో అందరూ సంయుక్తంగా పనిచేశారని చెప్పారు.

వెంకట్ మాట్లాడుతూ.. గతంలో వీరశంకర్ దర్శకత్వంలో "ప్రేమకోసం" సినిమా చేశాను. చాలా కాలం తర్వాత మళ్లీ చేస్తున్నానని తెలిపారు.

వీరశంకర్ మాట్లాడుతూ.. యువతరంతోపాటు అందరూ చూడదగ్గ చిత్రమిది. మనచుట్టూ జరిగే కథ. మనల్ని మనం కాపాడుకోవడానికి యువతం ఏం చేసింది అనేది ఈ సినిమాలో చూపెట్టామని చెప్పారు. గీతరచయితలు, సంగీత దర్శకులు, హీరోలు ఈ చిత్రం ద్వారానే పరిచయం అవుతున్నారు.

ఇందులో వెంకట్ నెగెటివ్ పాత్ర పోషించాడు. కృష్ణుడు బిజీ అయినప్పటికీ ఇందులో నటించినందుకు ధన్యవాదాలు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు వీరశంకర్ తెలిపారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments