Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నకృష్ణ "జీనియస్" చిత్రం ప్రారంభం

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2011 (12:17 IST)
దేవాలయాల బ్యాక్‌డ్రాప్‌తో నరసింహనాయుడు, ఇంద్ర, గంగోత్రి, బద్రినాథ్‌ చిత్రాలకు కథలు రాసిన చిన్నికృష్ణ ఇప్పుడు కలియుగ దైవం తిరుమలేశుని సన్నిధిని బ్యాక్‌డ్రాప్‌గా తీసుకున్నాడు. అందులో పనిచేసే పూజారి కొడుకు ప్రధాన పాత్రగా 'జీనియస్‌' చిత్రానికి కథ అందించారు. దీనికి టీవీలో రియాల్టీ షోలు చేసిన ఓంకార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పూజారి కొడుకుగా 'నువ్విలా'లో తేడాలాంటి పాత్రతో కామెడీ చేసిన హవిష్‌ నటిస్తున్నాడు.

ఏడాది క్రితం ఈ చిత్రం రూపకల్పన జరిగింది. అప్పుడు అందులో పూజారి కొడుకుగా ఓంకార్‌ సోదరుడు అశ్విన్‌ ఎంపిక చేసి ఆయన గుండు గీయించుకున్న ఫొటోను విడుదల చేశారు. ఏడాది తర్వాత పాత్రలు మారాయి. ఆ పాత్రను హవీష్‌కు ఇచ్చి, సెకండ్‌ హీరోగా ఉండే పాత్రను అశ్విన్‌ చేస్తున్నాడు. హీరోయిన్‌గా కేరళకు చెందిన తమిళ నటి సానుషా నటిస్తోంది.

ఈ చిత్రం ఓపెనింగ్‌ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. రామానాయుడు స్విచాన్‌ చేయగా, వినాయక్‌ క్లాప్‌ కొట్టారు. బి.గోపాల్‌ దర్శకత్వం వహించారు.

చిన్నికృష్ణ మాట్లాడుతూ, ఈ కథను అన్నాహజారే పుట్టిన ఊరిలో రాశాం. అంటే ఇదేదో అవినీతిపై తీసే చిత్రం కాదు. శంకర్‌ దర్శకత్వంలో ఉండే తరహా చిత్రం. అన్ని అంశాలు ఉంటాయి. ఈ చిత్రాన్ని 10కోట్లు ఖర్చు పెట్టడానికి దాసరి కిరణ్‌కుమార్‌ ముందుకు వచ్చారు. ఆయనకు నా ధన్యవాదాలు. పరుచూరి బ్రదర్స్‌ పదునైన సంభాషణలు చిత్రానికి రాస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తామని తెలిపారు.

దర్శకుడు ఓంకార్‌ మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని ప్రతి విద్యార్థికి అంకితమిస్తున్నాం. ప్రతి ఒక్కరూ చర్చించుకునేట్లుగా ఈ సినిమా ఉంటుంది. వారిలో మార్పువస్తే అదే పదికోట్లు అని అన్నారు. ఈ చిత్రంలో హైకోర్టు న్యాయవాది వరప్రసాద్‌ ఓ పాత్రను పోషిస్తున్నారు. కెమెరా: దివాకరన్‌, సంగీతం: జోస్వా శ్రీధర్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ముత్యాల రమేష్‌.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments