ఖుషి ఫేమ్ ఎస్.జె. సూర్య రూపొందిస్తున్న "కొమరం పులి" చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇందులో పవన్‌కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు మిగిలి ఉన్నాయి.
సంగీత యువకెరటం ఎ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ "కొమరం పులి"కి హైలైట్‌గా నిలుస్తుందని సినీ యూనిట్ వర్గాల సమాచారం.
ఇదిలా ఉంటే.. ఇటీవలే రవితేజకు "కిక్"తో హిట్ ఇచ్చిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్ నటించనున్నారని తెలిసింది.
ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలో ఈ సినిమా సెట్‌పైకి వెళ్ళనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. ఇంకా ఈ చిత్రాన్ని ప్రముఖ రాజకీయ నాయకుడు నిర్మించనున్నారు.