Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్ళతోనే చంపేసే 'బంగారు కోడిపెట్ట' నటి : సమంత కితాబు

Webdunia
నటికి హావభావాలు ముఖ్యం. కొందరు కళ్ళతోనే నటించేస్తారు. తర్వాత బాడీ లాంగ్వేజ్‌.... అలా సావిత్రి గురించి చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ కోవలోనే కలర్స్‌ స్వాతి వచ్చింది. ఈ విషయాన్ని నటి సమంత అంటోంది. నవదీప్‌, కలర్స్‌ స్వాతి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'బంగారు కోడిపెట్ట'. రాజ్‌ పిప్పాళ్ళ దర్శకుడు. సునీత తాటి నిర్మాత. మహేష్‌ శంకర్‌ సంగీతం అందించాడు.

ఈ చిత్రం ఆడియో విడుదల బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని పార్క్‌ హోటల్లో జరిగింది. ఆదిత్య మ్యూజిక్‌ద్వారా విడుదలైన ఆడియోను ముఖ్య అతిథి నటి సమంత విడుదల చేసి అల్లు అరవింద్‌కు అందజేశారు.

సమంత మాట్లాడుతూ... ఫిలిమ్ సిటీలో షూటింగ్‌ వల్ల ఆలస్యమైనందుకు క్షమించండి అంటూ, ఈ చిత్రం మనస్పూర్తిగా హిట్‌ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. స్వాతి నటించిన 'సుబ్రహ్మణ్యపురం' చిత్రాన్ని చెన్నైలో చూశాను. నా ఫ్రెండ్స్‌, నేను కలిసి చూశాం. డైలాగ్స్‌ లేకుండా కళ్ళతోనే చంపేసింది. గుడ్‌ పెర్‌ఫార్మర్‌. స్వాతి మంచి టాలెంట్‌ నటి. ఈ పాటల్లో ఒకటి విన్నాను. చాలా బాగుంది. మహేష్‌ శంకర్‌ సంగీతం బాగుంది. ప్రస్థానం చాలా బాగుందని అంటూ మెచ్చుకుంది.

స్వాతి మాట్లాడుతూ.. పాజిటివ్‌ లుక్‌తో అంతా పనిచేశారు. దర్శకుడు చాలా తెలివిగా మాచేత నటన రాబట్టారు. నవదీప్‌ బాగా నటించాడు అని చెప్పారు. అల్లు అరవింద్‌ మాట్లాడుతూ... నిర్మాత సునీత నా మేనకోడలు లాంటిది. మా కుటుంబానికి కావాల్సిన మనిషి. డి.సురేష్‌బాబు దగ్గర శిష్యరికం చేసింది. ట్రైలర్స్‌ చూశాను. మామూలు లవ్‌స్టోరీ కాకుండా ఏదో ఉందనిపించింది. ఓ నిధి కోసం వేటాడుతున్నట్లుగా అనిపించింది. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంది. దర్శకుడు మంచి టేస్ట్‌ ఉన్నవాడు అన్నారు.

నిర్మాత సునీత మాట్లాడుతూ.. నేను, అరవింద్‌ ఫ్యామిలీ మెంబర్స్‌. సినిమాపై ఇంట్రస్ట్‌తో సురేష్‌ బాబు దగ్గర చేరాను. దర్శకురాలిగా శిక్షణ తీసుకున్నాను. నన్ను చూసినప్పుడల్లా పూరీ, వినాయక్‌లు.. ఎప్పుడు దర్శకత్వం చేస్తావమ్మా! అని అంటుండేవారు. మొదటగా నిర్మాతగా మారాను. మంచి కథ ఇది. త్వరలో విడుదల చేస్తాం అని చెప్పారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments