Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలెక్షన్ల వెల్లువలో "చిరుత"నయుడి "మగధీర"

Webdunia
FILE
" చిరుత"నయుడు రామ్‌చరణ్ తేజ హీరోగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం "మగధీర". సెక్సీడాళ్ కాజల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందించగా, గీతాఆర్ట్స్ అధినేత అల్లుఅరవింద్ నిర్మించారు.

గతవారం లాంఛనంగా తెరపైకి విడుదలైన "మగధీర" మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అత్యున్నత ప్రమాణాలతో హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 50 థియేటర్లకు పైగా విడుదల చేయడం విశేషం. మరోవైపు ఉత్తరాంధ్రలో శ్రీ క్రాంతి కృష్ణా పిక్చర్స్ ద్వారా విడుదలైన "మగధీర" ప్రభంజనం సృష్టిస్తోంది. మొదటిరోజే పదివారాల టాక్ వచ్చింది.

అదేవిధంగా.. తూర్పుగోదావరిలో 17 కేంద్రాల్లో 40 థియేటర్లలో మగధీరను ప్రదర్శించారు. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తూర్పుగోదావరి జిల్లాలో మగధీర విడుదలైన మొదటిరోజు రూ. 27లక్షల వరకు వసూలైందని అంచనా.

ఇకపోతే.. నెల్లూరు టౌన్‌లో 9 థియేటర్లలో ఒక రోజు రూ. 7,42,332 గ్రాస్ వసూలు చేసిందని అంజనీ పిక్చర్స్ అధినేత భాస్కర రెడ్డి తెలిపారు. నైజాంలో కోటిరూపాయలు షేర్ వచ్చిందని, మిగిలిన జిల్లాల్లోనే అదే పరిస్థితి అని గీతాఆర్ట్స్ కార్యాలయం చెబుతోంది.

ఇంకేముంది..? భారీ కలెక్షన్లతో "మగధీర" స్థాయి అత్యున్నత స్థానానికి చేరుకుంటోందని సినీ పండితులు అంటున్నారు. ఈ సినిమాలోని గ్రాఫిక్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయని, కాస్ట్యూమ్స్, రామ్‌చరణ్ తేజ, కాజల్ అగర్వాల్ నటన అదిరిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments