Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకప్పుడు సినీగేయ రచయిత ఇప్పుడు మానసిక రోగి

Webdunia
శుక్రవారం, 20 డిశెంబరు 2013 (17:37 IST)
WD
చిత్రం, నువ్వు-నేను, జయం వంటి సూపర్ హిట్ సినిమాలకు పాటలు రాసిన ప్రముఖ సినీగేయ రచయిత కులశేఖర్ ఇటీవల ఓ దొంగతనం కేసులో పట్టుబడి జైలుపాలయిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు మతిస్థిమితం సరిగా లేకపోవడంవల్లే ఈ దొంగతనం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నా ఎవరూ అండగా లేని పరిస్థితి వచ్చింది.

ఇటీవల కులశేఖర్ అక్టోబ‌రు 24న కాకినాడ‌లోని ఓ గుడికి వెళ్లి.. అక్కడ ద‌ర్శనానంత‌రం దేవుడి శ‌ఠ‌గోపం ఎత్తుకొచ్చార‌నే ఆరోప‌ణ‌ల‌పై కుల‌శేఖ‌ర్‌‌ని అరెస్ట్ చేశారు. ఈ కేసుపై తీర్పు కూడా వ‌చ్చింది. కుల‌శేఖ‌ర్‌‌కి ఆరు నెల‌ల జైలు శిక్ష కూడా విధించారు. గీత ర‌చ‌యిత‌గా బిజీ అయిన‌ప్పుడే.. ఆయ‌న 'ప్రేమ‌లేఖ‌రాశా' అనే చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హించారు.

ఆ సినిమా చాలాకాలం పాటు విడుద‌ల‌కు నోచుకోలేదు. అప్పుడే కుల‌శేఖ‌ర్ మాన‌సిక ఒత్తిడికి గుర‌య్యారు. దీంతో ఆయన మానసికంగా బాధపడుతున్నట్లు సమాచారం. ఈ దొంగతనం కేసులో ఆయన తరుఫున ఎవరూ రాకపోవడంతో ప్రభుత్వమే ఓ న్యాయవాధిని నియమించి కేసును విచారించాలని ఆదేశించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటానంటూ భర్తకు సవాల్, మనస్తాపంతో భర్త ఆత్మహత్య

హష్ మనీ కేసు.. డొనాల్డ్ ట్రంప్ దోషే.. కానీ శిక్ష లేదు.. నేర చరిత్రతో పదవిలోకి?

ఫిబ్రవరి 10 నుండి 11 వరకు ఫ్రాన్స్‌లో ఏఐ సదస్సు.. హాజరు కానున్న ప్రధాని

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

Sankranthi: సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

Show comments