Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏఎన్నార్ ఆరోగ్యంపై అక్కినేని నాగార్జున... నాన్న బాగానే ఉన్నారు...

Webdunia
బుధవారం, 8 జనవరి 2014 (19:29 IST)
WD
అక్కినేని నాగేశ్వరరావు అస్వస్థతకు గురయ్యారని మీడియాలో వార్తలు రావడంపై అక్కినేని నాగార్జున ఖండించారు. తన తండ్రి క్షేమంగా ఉన్నారనీ, ఆందోళన చెందాల్సినదేమీ లేదని స్పష్టం చేశారు. ఐతే తన ఆరోగ్యం బాగోలేదని గత ఏడాది ఆయనే స్వయంగా ప్రెస్‌మీట్‌ పెట్టి తనకు కేన్సర్‌ కణాలు సోకాయని అక్కినేని చెప్పారు. అందరికీ ఆ కణాలు వుంటాయి. రెసిస్టెన్స్ పవర్‌ తగ్గడంతో అవి విజృంభిస్తాయని తెలిపారు. ఇప్పటికే గుండెపోటు ఆపరేషన్‌ చేసుకున్న తాను ఎప్పుడో చనిపోవాల్సిందని... కానీ ఇప్పుడు కూడా మొండిధైర్యంతో కేన్సర్‌ను ఎదిరిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.

కానీ.. నాగేశ్వరరావుగారు ఇప్పటికే కుర్చీలో కూర్చుంటే వెంటనే లేవలేరు. ఎందుకంటే కళ్ళు తిరుగుతాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఆయన్ను అంటిపెట్టుకుని నాగార్జున ఉంటున్నారు. అయితే... అప్పటినుంచి ఇంతకుముందు ఎప్పుడూ లేనివిధంగా నాగార్జున తన తండ్రితోనే గడుపుతున్నాడు.

ఎప్పుడులేనిది తండ్రిదగ్గర ఎక్కువ టైమ్‌ కేటాయిస్తున్నారేమిటి? అని ఓ విలేకరి ఇటీవలే అడిగితే... వెంటనే నాగార్జున కళ్లు చెమర్చాయి. తండ్రి అంటే అభిమానం... ఎవరికైనా ఉంటుంది. ఆయన లేకపోతే నేనులేను అంటూ కుటుంబ సంబంధాల గురించి వివరించారు.

అప్పుడే నాగేశ్వరరావు ఆరోగ్యం క్షీణించిందని అర్థమైంది. అప్పటికే ఓ శస్త్రచికిత్స కూడా జరిగింది. 'మనం' చిత్రంలో ఆయన పోర్షన్‌ పూర్తిచేశారు. డబ్బింగ్‌ కూడా ఇంటివద్దకే టెక్నీషియన్స్‌ వచ్చి చెప్పించారు. ఇప్పటికే ఆయన అభిమానులు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. ఈ నేపధ్యంలో బుధవారంనాడు అక్కినేని నాగేశ్వరరావు ఆరోగ్యం విషమంగా ఉందంటూ వార్తలు వచ్చాయి. దీనిపై అక్కినేని నాగార్జున స్పందిస్తూ... నాన్నగారి ఆరోగ్యం భేషుగ్గా ఉందనీ, వదంతులను ఎవరూ నమ్మవద్దని చెప్పారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments