Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియన్‌ ఐడిల్‌-5 విజేతగా సికింద్రాబాదు కుర్రాడు శ్రీరామ్!

Webdunia
FILE
ప్రముఖ ఉత్తరాది ఛానెల్ సోనీ టెలివిజన్ చేపట్టిన ప్రతిష్టాత్మక రియాలిటీ షో ఇండియన్‌ ఐడల్‌-5 కిరీటాన్ని మన తెలుగు తేజం సికింద్రాబాద్‌కు చెందిన 24 ఏళ్ల కుర్రాడు శ్రీరామ్‌చంద్ర కైవసం చేసుకున్నాడు. తెలుగు వాళ్లతో పాటు ఉత్తరాధి ప్రేక్షకులకు సైతం తెలుగు వాడి సత్తాను వెలుగెత్తి చాటాడు.

శ్రీరామ్‌ గాత్రానికి యావత్‌ భారతం పులకించింది. హోరాహోరీగా సాగిన ఇండియన్‌ ఐడల్‌-5 టైటిల్‌ తుది పోరులో శ్రీరామ్‌ విజేతగా నిలిచాడు. బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ఇండియన్‌ ఐడల్‌ విజేతను రిమోట్ ద్వారా ప్రకటించారు. శ్రీరామ్ తన అద్భుత గాత్రంతో న్యాయ నిర్ణేతలను సైతం మైమరపింపచేశాడు.

ఫైనల్లో టాప్ 3కు చేరుకున్న శ్రీరామ్, తన ముగ్గురు సహగాయకులతో పాటు యావత్‌ సంగీతాభిమానులు ఆతృతతో ఎదురు చూస్తుండగా బిగ్‌ బీ అమితాబ్‌ రిమోట్‌ ద్వారా విజేతను ప్రకటించారు. శ్రీరామ్ విజేతగా నిలవగానే హర్షద్వానాలు మిన్నంటాయి.

తన గెలుపు కోసం ఎస్ఎస్ఎస్ చేసిన ప్రతి ఒక్కరికీ శ్రీరామ్ కృతజ్ఞతలు తెలిపారు. క్రమశిక్షణతో కూడిన సాధనే తన ఉన్నతికి నిదర్శరమని చెప్పారు. ఇండియన్‌ ఐడల్‌గా నిలిచిన శ్రీరామ్‌కు రూ. 50 లక్షల ప్రైజ్‌మనీతో పాటు కారును బహుమతిగా ఇచ్చారు. ఈ కాంటెస్ట్‌లో రాకేష్‌ రెండవ స్థానంలోనూ, భూమిక మూడవ స్థానంలో నిలిచారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments