Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ నలుగురిలో వెంకీ సేఫ్‌ జోన్లో ఉన్నాడా...?! నాగ్ పరిస్థితి ఏంటి...?!!

Webdunia
సోమవారం, 28 అక్టోబరు 2013 (14:51 IST)
WD
ఇండస్ట్రీలో చాలాకాలం అగ్రహీరోలుగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లు నిలిచారు. వయస్సురీత్యా ఎవరికివారు భిన్నమైన కథల్ని ఎంచుకుంటూ ముందుకుసాగుతున్నారు. చిరంజీవి 2009 నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ.. ఇదిగో అదిగో అంటూ నాన్చుతున్నారు. కానీ తను ఇంకా సినిమాలు చేసే సీన్‌ లేదని తెలుస్తోంది.

మరోవైపు బాలకృష్ణ రాజకీయ తెరంగేట్రం జరిగిపోతుంది. తెలుగుదేశాన్ని ఒక దశకు తీసుకురావాలి కంకణం కట్టుకున్నాడు. సినీ గ్లామర్‌ అందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాడు. అందుకే తాను చేస్తున్న తాజా చిత్రంలో రాజకీయరంగానికి ప్రజాశ్రేయస్సుకు చెందిన అంశాలను టచ్‌ చేస్తున్నాడు.

ఇక నాగార్జున ఇప్పటికే 'భాయ్‌'తో తన కెరియర్‌ ఎటువైపు అనే ఆలోచనలో పడ్డాడు. 'మనం' చిత్రం సాగుతోంది. అన్నపూర్ణ, రామానాయుడు ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన వారితో సినిమాలు చేయించే పనిలో ఉన్నాడు. మరోవైపు అఖిల్‌ను పరిచయం చేసే పనిలోనూ ఉన్నాడు. ఇంకా తను ప్రేమకథలు చేయడం ఫూలిష్‌ అంటూ... కొత్తకథలు వస్తే సినిమాలు చేస్తాననీ, చిత్రాలూ నిర్మిస్తానని ప్రకటించాడు.

మల్టీస్టారర్‌ చిత్రాలు చేయడం ఇష్టమేనంటూ కథలు లేవని చెబుతున్నాడు. ఇక మిగిలినవాడు వెంకటేష్‌... ఈయన తన సత్తా ఏమిటో... మహేష్‌ బాబుతో నిరూపించుకున్నాడు. అందుకే ఇకపై సోలో హీరోగా చేయడానికి రచయితలకు గ్రీన్‌ స్నిగల్‌ ఇవ్వడంలేదు. తాజాగా రామ్‌తో 'మసాలా'లో చేశాడు. ఎవరితో చేసినా వెంకీ మార్కెట్‌ బ్యాలెన్స్‌గా ఉంటుంది.

మహేష్‌తో చేస్తేనే 30 కోట్ల క్లబ్‌కు చేరుకున్నారు. ఇప్పుడు దాన్ని మసాలాతో బీట్‌ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా రామ్ చరణ్‌తో కలిసి నటించేందుకు వెంకటేష్‌ గ్రీన్‌ స్నిగల్‌ ఇచ్చాడు. త్వరలో వివరాలు తెలియనున్నాయి.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments