Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్యను పబ్లిక్‌గా పెళ్లిచేసుకోమని అడిగిన హీరోయిన్

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2013 (17:44 IST)
PR
తమిళ హీరో ఆర్య- నయనతారలు ప్రేమాయణం నడుపుతున్నారని ఆమధ్య 'రాజారాణి' సినిమా విడుదల కాకముందు ప్రచారం సాగింది. అయితే ఇవన్నీ వట్టి పుకార్లేనని సినిమా ప్రచారంలో భాగమని చిత్ర యూనిట్ చెప్పడంతో ఆ గాసిప్స్‌కి తెరపడింది. కోలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ అయిన ఆర్య ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడనేది ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

అయితే ఆర్య తనను పెళ్లిచేసుకోవాలని ఓ కోలీవుడ్ హీరోయిన్ పబ్లిక్‌గా ప్రపోజ్ చేసింది. ఆ అమ్మడి పేరు పూజా ఉమాశంకర్. శ్రీలంక -ఇండియన్ ఫిలిం ఆర్టిస్ట్. డైరెక్టర్ బాల దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా ''నాన్ కాదవుల్''చిత్రంలో అంధురాలిగా నటించి విమర్శకుల ప్రశంసలు పొందింది.

తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డుతో పాటు, సౌత్ ఫిలింఫేర్ అవార్డుని కూడా అందుకుంది. పలు శ్రీలంక హిట్ చిత్రాల్లో నటించింది. క్రికెట్ లీగ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా చేస్తోంది. ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. స్నేహాన్ని వ్యక్తపరచడానికి ఎల్లో ప్లవర్, ప్రేమను వ్యక్తపరచడానికి రెడ్ ఫ్లవర్, పెళ్లి ప్రపోజల్‌కు వైట్ ఫ్లవర్ ఇస్తారనే విషయం తెలిసిందే.

అయితే ఈ మూడు ఫ్లవర్స్ ఇవ్వాల్సి వస్తే మీరు ఎవరికి ఇస్తారు? అని అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ, హీరో భరత్‌కు ఎల్లో ఫ్లవర్, విశాల్‌లకు రెడ్ ఫ్లవర్, ఆర్యకు వైట్ ఫ్లవర్ ఇస్తానని చెప్పుకొచ్చింది. ఆర్య తనకు చాలాకాలం నుంచి సుపరిచితమని నాయొక్క ఇష్టాలు, అయిష్టాలు అతనికి బాగా తెలుసునని పూజా చెప్పడం గమనార్హం.

మరి పూజా ఈ విషయాలు సరదాగా చెప్పిందో? లేక తన మనసులో ఆర్యను పెళ్లి చేసుకోవాలనే ఆలోచనను ఈ సందర్భంగా బయటపెట్టిందా? అనేది చూడాలి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments